YS Viveka Case: వైఎస్ వివేకా కేసు.. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Viveka Case: వైఎస్ వివేకా కేసులో ఏ1 నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు గురువారం రద్దు చేసింది. వచ్చే నెల 5లోగో హైదరాబాద్ సీబీఐ కోర్టు ముందు లొంగిపోవాలని ఎర్ర గంగరెడ్డిని ఆదేశించింది. ఒకవేళ గంగిరెడ్డి లొంగిపోకపోతే అరెస్ట్ చేయవచ్చని సీబీఐకి తెలంగాణ హైకోర్టు సూచించింది. గతంలో అరెస్ట్ అయిన గంగిరెడ్డికి తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వైఎస్ వివేకా కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై వైఎస్ సునీతారెడ్డి కూడా ఇంప్లీడ్ అయ్యారు. ఇరుపక్షాల వాదనలను విన్న తెలంగాణ హైకోర్టు సీబీఐ వాదనలతో ఏకీభవించింది. ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. దీంతో గంగిరెడ్డి బెయిల్‌పై సీబీఐకి హైకోర్టులో ఊరట లభించినట్లయింది.
Read Also: Andhrapradesh: గుడ్డు తిని చిన్నారి మృతి.. బాధిత కుటుంబానికి రూ.8 లక్షల పరిహారం
Also Read
- Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ 1 నిందితుడు గంగిరెడ్డి కీలక పాత్రధారి అని సీబీఐ ఆరోపిస్తుంది. బెయిల్‌పై గంగిరెడ్డి బెయిల్ పై బయట ఉంటే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ అనుమానిస్తుంది. ఇదే విషయాన్ని సీబీఐ తరపు న్యాయవాదులు వాదనలు విన్పించారు. సీబీఐ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తూ ఇవాళ తీర్పును వెల్లడించింది. గతంలో ఈ కేసును విచారించిన సిట్ సకాలంలో చార్జీషీట్ దాఖలు చేయని కారణంగా ఎర్ర గంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిల్ లభించిన విషయాన్ని సీబీఐ గుర్తు చేస్తుంది. ఈ కేసులో కీలకపాత్రధారిగా ఉన్న గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని 2022 నవంబర్ 14న సుప్రీంకోర్టును ఆశ్రయించింది సీబీఐ. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించింది సుప్రీంకోర్టు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును తెలంగాణ హైకోర్టు విచారిస్తున్నందున ఈ కేసును కూడా తెలంగాణ హైకోర్టు విచారించాలని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టులో ఈ విషయమై అన్ని వర్గాల వాదనలను విన్న తెలంగాణ హైకోర్టు గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజావార్తలు
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
-
Supreme Court: కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రి క్షమాపణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!