భారత వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీకి చెందిన రిలయ్స్ కంపెనీ ఇంతింతై వటుడింతై అన్న చందాన చిన్న టేబుల్, నాలుగు కుర్చీలతో ప్రారంభమైన వ్యాపారం నేడు దేశంలోనే పేరెన్నికగన్న వ్యాపారంగా మారింది. రిలయన్స్ సంస్థ ఎన్నో వ్యాపారల్లో పెట్టుబడులు పెడుతున్నది. ఆయిల్, ఇన్‌ఫ్రా, టెలికాం ఇలా ఎన్నో రంగాల్లో రాణిస్తోంది. పోటీగా ఎన్ని సంస్థలు వస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు తనను తాను సంస్కరించుకుంటూ గ్లోబల్ పరంగా గుర్తింపు పొందుతూ దూసుకుపోతున్నది.
Read: వైరల్: చేపల కోసం గాలం వేస్తే… యాపిల్ దొరికింది…
ధీరూభాయ్ అంబానీ స్థాపించిన సామ్రాజ్యాన్ని ముఖేష్ అంబాని విస్తరింపజేశారు. ఎప్పటికప్పుడు వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి, వ్యాపారంలో సంస్కరణలు తీసుకొచ్చే విషయంలో చాలా రకాల బుక్స్ చాలా ఉపయోగపడుతుంటాయని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. 2021 బిజినెస్ ఇయర్‌ని అర్థం చేసుకోవడానికి.. 2022కి సన్నద్ధం కావడానికి ముకేష్ అంబానీకి ఐదు పుస్తకాలు సాయపడ్డాయట. ఆ పుస్తకాలు చదివిన తరువాత 2022 లో తన లక్ష్యాలను నిర్దేశించుకున్నట్టు ముఖేష్ అంబానీ పేర్కొన్నారు.
Read: 26వేల బైకులను రీకాల్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్.. కారణం ఏంటంటే..?
ఇండో అమెరికన్ జర్నలిస్ట్ ఫరీద్ జకారియా రచించిన టెన్ లెస్సన్స్ ఫర్ ఏ పోస్ట్ ప్యాండెమిక్ వరల్డ్, అమెరికన్ బిలినియర్ ఇన్వెస్టర్ రే ధాలియో రచించిన ప్రిన్సిపుల్స్ ఫర్ డీలింగ్ విత్ ది ఛేంజింగ్ వరల్డ్ ఆర్డర్: వై నేషన్స్ సక్సీడ్ అండ్ ఫెయిల్, అమెరికన్ రచయిత అలెక్ రాస్ రచించిన ది రాగింగ్ 2020: కంపెనీస్, కంట్రీస్, పీపుల్ అండ్ ది ఫైట్ ఫర్ అవర్ ఫ్యూఛర్, స్సానిష్ సోషియాలజిస్ట్ మౌరో గుయిల్లెన్ రచించిన 2030: హౌ టుడేస్ బిగ్గెస్ట్ ట్రెండ్స్ విల్ కొలిడే అండ్ రీషేప్ ది ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీథింగ్, అమెరికన్ ఎంటర్‌ప్రెన్యుర్ జోష్ లింక్నన్ రచించిన బిగ్ లిటిల్ బ్రేక్‌త్రోస్: హౌ స్మాల్, ఎవ్రీడే ఇన్నొవేషన్స్ డ్రైవ్ ఓవర్‌సైజ్డ్ రిజల్ట్స్ పుస్తకాలు చాలా ఉపయోగపడ్డాయని ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. ఔత్సాహిక వ్యాపారవేత్తలు తప్పకుండా చదవాలని, అందులోని విషయాలను అర్థం చేసుకుంటే వ్యాపార రంగంలో ముందుకు వెళ్లేందుకు అవి తొడ్పాటును అందిస్తాయని అన్నారు.