పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సిద్ధూ అలక దిగివచ్చి పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ పదవిలో కొనసాగనున్నారు. అయితే, సిద్ధూ చెప్పిన విధంగా ప్రభుత్వంలో పాలన సాగితే మరోసారి అంతర్గత విభేదాలు బహిరంగమయ్యే అవకాశం ఉన్నది. కొత్త ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ త్వరలోనే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉన్నది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినట్టు ప్రకటించారు. పంజాబ్ కాంగ్రెస్‌లో చీలిక గురించి మాట్లాడారు. ఒకవేళ చీలిక ఏర్పడి పార్టీ మైనారిటీలో పడిపోతే దాని వలన కాంగ్రెస్‌కు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే పంజాబ్‌లో స్ట్రాంగ్ అవుతున్న ఆప్‌కు ఇది కలిసి వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఆప్ 16 సీట్లు గెలుచుకున్నది. వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నది. అదే విధంగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌లో ఉద్యమం జరుగుతున్నప్పటికీ, బీజేపీ గతంలో కంటే ఆ రాష్ట్రంలో మరింత బలపడే అవకాశం ఉన్నట్టుగా నిపుణులు పేర్కొంటున్నారు. అటు గ్రామాల్లో శిరోమణి అకాళిదళ్ పార్టీ ఇప్పటికీ బలంగా ఉన్నది. ఈ పార్టీ బీఎస్పీతో జతకడుతుండటంతో మరికొంత బలం పెంచుకునే అవకాశం ఉంటుంది. పంజాబ్‌లో హంగ్ ఏర్పడితే ఎవరికి కలిసివస్తుందో చూడాలి.
Read: తాలిబన్ ప్రభుత్వానికి చైనా సాయం: కాబూల్‌కు చేరిన భారీ సామాగ్రి…