కరోనా కారణంగా నల్లమల అడవిలో టైగర్ సఫారీని నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా నవంబర్ 17 వ తేదీ నుంచి టైగర్ సఫారీని తిరిగి ప్రారంభించారు. కరోనా కారణంగా గత ఏడాదిన్నర నుంచి ఎక్కడికి వెళ్లలేక ఏదైనా కొత్త ప్రాంతాలను సందర్శించాలనుకునే వారికి నల్లమల టైగర్ సఫారి ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం అవసరం లేదు.
Read: ఆ రాష్ట్రంలో కరోనా ఆంక్షలు పూర్తిగా ఎత్తివేత…
ట్రెక్కింగ్ తోపాటుగా వన్యప్రాణులు, వన్యమృగాలను సందర్శించేందుకు వీలు కలుగుతుంది. హైదరాబాద్ నుంచి సమీపంలోనే ఉండటంతో ఎక్కువ మంది ఈ టైగర్ సఫారీని సందర్శించేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇద్దరు వ్యక్తులు టైగర్ నైట్ సఫారీ చేసుందుకు రూ.4600, నలుగురు వ్యక్తులకు 7 వేలు, 12 మంది వ్యక్తులకు రూ.17 వేలు ఖర్చు అవుతుందని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.