ఆ రాష్ట్రంలో క‌రోనా ఆంక్ష‌లు పూర్తిగా ఎత్తివేత‌…

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి దేశం ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డుతున్న‌ది.  వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత పెద్ద ఎత్తున వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేశాయి రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు.  కేసులు, మ‌ర‌ణాల సంఖ్య త‌గ్గుతున్నా,  మూడో వేవ్ ప్ర‌మాదాన్ని దృష్టిలో పెట్టుకొని క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటిస్తూనే ఉన్నాయి రాష్ట్రాలు.  ఇక ఇదిలా ఉంటే, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.  

Read: చైనా బోర్డ‌ర్‌లో ఇండియన్ ఆర్మీ ఎయిర్‌ఫోర్స్ విన్యాసాలు… శీతాకాలంలో…

క‌రోనా ఆంక్ష‌ల‌ను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది.  ఆంక్ష‌ల‌ను పూర్తిగా ఎత్తివేత త‌క్ష‌ణ‌మే అమ‌లులోకి వ‌స్తున్న‌ట్టు ఆ రాష్ట్ర‌ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  గ‌తంలో మాదిరిగానే అన్ని కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని, అయితే ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ప‌నిచేసే సిబ్బంది త‌ప్ప‌నిస‌రిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకొని ఉండాల‌ని, అదేవిధంగా సినిమా థియోట‌ర్ల‌కు వ‌చ్చే ప్రేక్ష‌కులు క‌నీసం ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకొని ఉండాల‌నే నిబంధ‌న‌లను విధించింది మ‌ధ్య‌ప్ర‌దేశ్ స‌ర్కార్‌.  

Related Articles

Latest Articles