CEO Vikas Raj: తెలంగాణలో ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగాయని రాష్ట్ర ఎన్నికల అధికారి(సీఈవో) వికాస్ రాజ్ వెల్లడించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తలేదన్నారు. మధ్యాహ్నం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా వచ్చారని పేర్కొన్నారు. ఇంకా 13, 14 వందల పోలింగ్ స్టేషన్లో ఇంకా పోలింగ్ నడుస్తోందని తెలిపారు. ఉదయం నుంచి పోలింగ్ మంచిగా జరిగిందన్నారు. తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైందని.. అత్యధికంగా మెదక్‌లో 71.33 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 39.17 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. కేంద్ర ఆధ్వర్యంలో ఉండే యాప్‌లలో 415 ఫిర్యాదులు రాగా.. వేర్వేరు ప్రాంతాల్లో 38 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయన్నారు. 225 ఫిర్యాదులు సీ విజిల్ యాప్ ద్వారా వచ్చాయన్నారు. భారీ బందోబస్తుతో స్ట్రాంగ్‌రూమ్స్‌లో ఈవీఎంలను భద్రపరుస్తామన్నారు.
Read Also: Lok Sabha Elections 2024: తెలంగాణలో 5 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా..
ఈవీఎంలలో సమస్య వస్తే వెంటనే రీప్లేస్ చేశామని.. సాయంత్రం ఐదు గంటలకు వచ్చిన పోలింగ్ శాతం అంచనానే అంటూ సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. రాత్రి 7 గంటల తర్వాత కచ్చితమైన పోలింగ్ శాతం వస్తుందని.. రేపు పూర్తి పోలింగ్ శాతం వస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు 330 కోట్లు సీజ్ చేశామన్నారు. 44 కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయని.. జనరల్ అబ్జర్వర్స్ ఇచ్చే నివేదిక మేరకు ఎక్కడైనా రీపోలింగ్ అవసరమా లేదా నిర్ణయిస్తామన్నారు.