ఆన్‌లైన్ షాపింగ్ రంగం అభివృద్ది చెందిన తరువాత చిన్న చిన్న వాటిని కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి వచ్చిందని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో వాటిపై ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సంఘటన ఒకటి ఇటీవల జరిగింది. కేరళకు చెందిన మిథున్ బాబు అనే వ్యక్తి పాస్‌పోర్ట్ కవర్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేశాడు. బుక్ చేసిన కవర్ ఇంటికి వచ్చింది. పార్శిల్ కవర్‌ను ఒపెన్ చేసి చూసి మిథున్ షాక్ అయ్యాడు.
Read: పేటీఎం కీలక నిర్ణయం… బిట్‌కాయిన్ ట్రేడింగ్ రంగంలోకి…
పార్శిల్ కవర్‌లో పాస్‌పోర్ట్ కవర్ తో పాటుగా ఒరిజినల్ పాస్‌పోర్ట్‌కూడా ఉన్నది. వెంటనే ఈ విషయాన్ని అమెజాన్ కస్టమర్ కేర్ సెంటర్‌కు కాల్ చేసి చెప్పగా, పొరపాటు జరిగిందని, భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని సమాధానం ఇచ్చారు. ఆ ఒరిజినల్ పాస్‌పోర్ట్ త్రిసూర్‌కు చెందిన మహ్మద్ సాలిహ్ అనే వ్యక్తికి సంబంధించినది. ఆ పాస్‌పోర్ట్ అమెజాన్ చేతికి ఎలా వచ్చింది అన్నది అర్ధంగాని విషయం.