ఆమె ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. గౌరవ ప్రదమైన వృత్తిలో ఉంది. పది మందిని సన్మార్గంలో నడిపించాల్సిన పండితులమ్మ బుద్ధిహీనురాలిలా ప్రవర్తించింది. టికెట్ తీసుకుని రైల్లో ప్రయాణించాల్సిన ఆమె.. దర్జాగా ఏసీ కోచ్‌లో కూర్చుని జర్నీ చేస్తోంది. టికెట్ చూపించమన్న పాపానికి టిక్కెట్ కలెక్టర్ వేధిస్తున్నాడంటూ రివర్స్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బీజాపూర్‌లో పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో నక్సలైట్లు మరో హత్యకు పాల్పడ్డారు. ఉపాధ్యాయుడిని హత్య చేశారు మావోయిస్టులు. కళ్ళు తాటి తోడ్కా అనే ఉపాధ్యాయుడుని గంగలూర్ ప్రాంతంలోని నేంద్రలో డ్యూటీ వేశారు.. నిన్న సాయంత్రం, పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా, నక్సలైట్లు అతన్ని కిడ్నాప్ చేసి హత్య చేశారు. మూసివేసిన పాఠశాలను తిరిగి తెరిచిన కారణంగా ఈ హత్య చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 9 మంది పోలీస్ ఇన్ ఫార్ములా పేరిట హత్య చేసినట్లుగా…
మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని అంటుంటారు. అంటే తల్లి, తండ్రి, గురువు దైవంతో సమానం అంటారు. భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులు, గురువుల పట్ల గౌరవం, భక్తి కలిగి ఉండాలని చెబుతుంటారు.
విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి సక్రమ మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులు తప్పటడుగులు వేస్తున్నారు. కొందరి టీచర్ల ప్రవర్తన ఉపాధ్యాయ లోకానికే మాయని మచ్చగా మారుతోంది. కన్నబిడ్డల్లా చూసుకోవాల్సింది పోయి విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. మోడల్ స్కూల్లో ఓ విద్యార్థినిని ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురిచేశాడు. విసిగిపోయిన విద్యార్థిని విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. Also Read:IND vs ENG: ఆడే మ్యాచ్‌లను ఎంచుకోవడం ఏంటి?.. బుమ్రాపై భారత్ మాజీ కెప్టెన్ ఫైర్!…
కంబదూరు మండల కేంద్రం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు హనుమంతురాయుడు మరొక పాఠశాలకు బదిలీ అయ్యారు.. దీంతో, పాఠశాలలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు 'మమ్మల్ని వదిలి వెళ్లకండి సార్' అంటూ కన్నీరు పెట్టుకున్నారు.
అగ్ని ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈసారి కారులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రభుత్వ టీచర్ సజీవ దహనమయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఉమ్నాబాద్ జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి చెందాడు. నల్గొండ జిల్లా గొల్లగూడకు చెందిన టీచర్ సురేష్ కారులోనే సజీవ దహనమయ్యాడు. షిర్డి…
టీచర్ తన సెల్ ఫోన్ తీసుకున్నరని ఓ విద్యార్థిని ఏకంగా చెప్పుతో కొట్టింది. ఇప్పుడు ఈ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ విచారకరమైన ఘటన విశాఖ, విజయనగరం మధ్య దాకమ్మరిలో ఉన్న ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో చోటు చేసుకుంది.
విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించి వారి భవిష్యత్తుకు పాటుపడాల్సిన కొందరు ఉపాధ్యాయులు బుద్ది లేకుండా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులు తప్పులు చేస్తే సరిచేయాల్సిందిపోయి టీచర్లే తప్పుడు పనులకు పూనుకుంటున్నారు. కొందరి ఉపాధ్యాయుల ప్రవర్తన, ఉపాధ్యాయలోకానికే మాయని మచ్చగా మారింది. తాజాగా వరంగల్ లో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థినితో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగుచూసింది. విషయం తెలిసిన విద్యార్థిని కుటుంబ సభ్యులు కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Also Read:Tim Southee: న్యూజిలాండ్ ఛాంపియన్స్…
Teacher: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పాడు. విద్యార్థినిని తన ‘‘గర్ల్‌ఫ్రెండ్’’గా ఉండాలని కోరాడు. ఈ ఘటన బీహార్‌లో జరిగింది. తన గురుదక్షిణ కింద గర్ల్ ఫ్రెండ్‌గా మారమని కోరడం పెద్ద వివాదానికి దారి తీసింది. బాలిక పాఠశాలలో ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటి వరకు కేసు నమోదు కాలేదు. పాఠశాల అధికారులు రాష్ట్ర విద్యాశాఖకు ఫిర్యాదు చేశారు, కానీ ఇప్పటి వరకు సదరు ఉపాధ్యాయుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
‘ఆచార్య దేవోభవ’.. తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానం గురువుకు కట్టబెట్టింది మన దేశం. అయితే ఇటీవల కొంతమంది ఉపాధ్యాయులు తమ వృత్తి ధర్మాన్ని మరచిపోయి ప్రవర్తిస్తున్నారు. విద్యార్థులను వేధింపులకు గురిచేయడం, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ.. ఉపాధ్యాయ వృత్తికి కలంకం తెస్తున్నారు. కీచకోపాధ్యాయులకు దేహశుద్ధి చేసినా ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి ప్రాథమిక పాఠశాలలో లక్ష్మన్న ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.…