రష్యాలో భారీ విస్ఫోటనం జరిగింది. డాగేస్తాన్ గ్యాస్ స్టేషన్‌లో భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడినట్లుగా అధికారులు తెలిపారు.
యూపీలోని డియోరియాలో మొబైల్ దొంగతనం చేశాడనే అనుమానంతో ఒక యువకుడిని దారుణంగా కొట్టారు. అతడి ప్రైవేట్ భాగంపై బెల్టుతో కొట్టి మరీ కక్ష తీర్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ వైరల్ వీడియోలో బాధితుడిని సోఫాలో బోర్ల పడుకోబెట్టారు.
అస్సాంలో కాంగ్రెస్ ఎంపీ రకీబుల్ హుస్సేన్‌పై దుండగులు దాడికి తెగబడ్డారు. పార్టీ కార్యక్రమానికి స్కూటర్‌పై వెళ్తుండగా ముసుగులు ధరించిన ఆగంతకులు బ్యాట్లతో దాడికి పాల్పడ్డారు.
పశ్చిమ బెంగాల్‌లోని ఓ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్.. క్లాస్ రూమ్‌లో స్టూడెంట్‌ను పెళ్లాడిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది.
స్కూల్ చాలా పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా పిల్లలకు, జీవితంలో అత్యుత్తమ పునాది పాఠశాలలో వేయబడుతుంది. అందుకే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి బడిలో చదివించాలని కష్టపడుతున్నారు.. డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడరు. కొంతమంది ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలతో పాటు జీవితం గురించి కూడా బోధిస్తారు. అన్ని రంగాల్లో రాణించగలమన్న సత్తాను చాటుతున్నారు... ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లోనూ మంచి విద్యనభ్యసిస్తున్నారనే నమ్మకం ఉంది..
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వాషింగ్టన్ నేషనల్ కేథడ్రల్ చర్చిలో జరిగిన ప్రార్థనా కార్యక్రమాల్లో అధ్యక్షుడు బైడెన్ దంపతుల సహా.. కాబోయే అధ్యక్షుడు ట్రంప్ దంపతులు, మాజీ అధ్యక్షుల కుటుంబాలు హాజరయ్యారు.
జైలు నుంచి విడుదలవ్వడమంటే ఏ ఖైదీకైనా సంతోషమే. నాలుగు గోడల మధ్య బందీ అయిపోయే.. కుటుంబానికి దూరమైపోవడం అంటే ఎవరికైనా బాధాకరమే. మొత్తానికి జైలు శిక్ష పూర్తి చేసుకుని చెరసాల నుంచి ఖైదీ బయటకు వచ్చాడు.
ఓ వ్యక్తి ట్రాఫిక్ పోలీసులకు కారుతో ఈడ్చుకళ్లాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు కారు బానెట్‌కు వేలాడుతూ ఉండడం, డ్రైవర్ వేగంగా కారు నడుపుతూ వారిని ఢీకొట్టేందుకు ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటన శనివారం సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో జరిగింది. పోలీసులు ఎందుకో కారు ఆపాలని కోరారు.
బతుకు బండిని లాక్కెళ్లేందుకు ఒక్కొక్కరిది ఒక్కోక్క దారి. ఏదో ఒకలా సంపాదించి పొట్ట నింపుకునే కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. ఏదోలా నాలుగు రాళ్లు సంపాదించి కుటుంబాన్ని, పిల్లల్ని పోషించుకుంటారు. దొరికిన పని చేస్తూ.. డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అలాగే ఓ వ్యక్తి తన రెండు చేతులు లేకున్నప్పటికీ తానే డెలివరీలు చేయడమే కాకుండా స్కూటర్‌ను స్వయంగా నడుపుతున్నాడు.