ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైంది. తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఆ దేశంలో అరాచకాలు మొదలయ్యాయి. నడిరోడ్డుపైనే బెదిరించి కిడ్నాపులు చేయడం మొదలుపెట్టారు. రాజధాని కాబూల్‌లో భారత వ్యాపారి బన్సరీలాల్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. 50ఏళ్ల బన్సరీలాల్ కాబూల్‌లో ఫార్మా వ్యాపారం చేస్తున్నారు. ఉదయం కారులో ఇంటి నుంచి బయలుదేరగా మార్గమధ్యంలో ఓ కారులో వచ్చిన దుండగులు బన్సరీలాల్ కారును ఢీకొట్టారు. అనంతరం వ్యాపారిని, ఆయన సిబ్బందిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. అయితే, సిబ్బంది తప్పించుకొని బయటపడగా, భారత వ్యాపారి మాత్రం కిడ్నాపర్ల చెరలోనే ఉన్నారు. ఈ కిడ్నాప్ వ్యావహారంపై భారత విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేసినట్టు ఇండియన్ వరల్డ్ ఫోరమ్ అధ్యక్షుడు పునీత్ చందోక్ పేర్కొన్నారు. ఈ కిడ్నాప్ వెనుక తాలిబన్లు ఉన్నారా తేదంటే ఎంకెవరైనా ఉన్నారా అనే విషయం తెలియాల్సి ఉన్నది.
Read: వ్యాక్సినేషన్‌లో ఇండియా మరో రికార్డ్… ప్రపంచంలోనే అత్యధికంగా…