Kidnap : ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సచివాలయ ఉద్యోగిని సోయం శ్రీ సౌమ్య.. కిడ్నాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ఒక్క రోజులోనే కేసును ఛేదించారు. కిడ్నాపర్లతోపాటు శ్రీ సౌమ్యను ఒడిశాలోని చిత్రకొండలో గుర్తించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా శరభవరం సచివాలయ ఉద్యోగిని సోయం శ్రీసౌమ్య కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఆమెను ఒడిశాలోని చిత్రకొండలో గుర్తించారు. ఆమెతోపాటు ఆమెను ఎత్తుకెళ్లిన నిందితులను కూడా పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్…
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరులో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులు వీరంగం సృష్టించారు. నర్సింహారెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచర్ల సహాయంతో దొర్నిపాడు మండలం అర్జునపురంకు చెందిన హేమలత అనే మహిళను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు.
Bride Flees With Boyfriend: మధ్యప్రదేశ్‌లోని గంజ్‌బసోడాలో వధువు తన బాయ్‌ఫ్రెండ్‌తో లేచిపోవడం వార్తల్లో నిలిచింది. రిసెప్షన్‌కి ముందే ప్రియుడితో లేచిపోయింది. రిసెప్షన్ కోసం సిద్ధం కావడానికి బ్యూటీ పార్లర్‌కి వెళ్లిన వధవు, తిరిగి వస్తుండగా కొంత మందితో కలిసి కారులో పారిపోయింది. ముందుగా, తన భార్యను కిడ్నాప్ చేశారని భర్త ఆరోపించాడు, తన భార్యను తిరిగి తీసుకురావడానికి పోలీస్ స్టేషన్‌ని ఆశ్రయించాడు. విచారణలో అసలు నిజం తెలిసి అంతా షాకయ్యారు.
ఆదిభట్లలో వస్త్ర వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపింది. వ్యాపారి నారాయణను కిడ్నాప్ చేసి ఆగంతకులు కోటి రూపాయలను డిమాండ్ చేశారు. లేడీ వాయిస్‌తో ట్రాప్ చేయించి దుండగులు కిడ్నాప్‌కు పాల్పడ్డారు. తుపాకీని తలపై పెట్టి కోటి రూపాయలు డిమాండ్ చేశారు.
పసికందును కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కోఠి ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్‌లో జరిగింది. అప్పుడే పుట్టిన పసికందును కిడ్నాప్ చేసేందుకు యత్నించిన మహిళను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో నిన్న (బుధవారం) కిడ్నాప్ అయిన శిశువు సేఫ్‌గా ఉంది. హైదరాబాద్‌లో చిన్నారి ఆచూకీ లభ్యమైంది. కిడ్నాపర్ల నుంచి పాపని రక్షించి పోలీసులు సంగారెడ్డికి తీసుకువచ్చారు. కాగా.. శిశువు కిడ్నాప్ అయిన 30 గంటల్లోనే కేసును సంగారెడ్డి పోలీసులు ఛేదించారు.
పెళ్లి ఒత్తిడితో తంటాలు పడ్డ ఓ యువతి తనను కిడ్నాప్ చేసినట్లు నటించి కుటుంబ సభ్యులను, పోలీసులను ఆశ్చర్యపరిచింది. యువతి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తనను కిడ్నాప్ చేశానని, వెంటనే రక్షించాలని చెప్పింది. దీంతో భయపడిన కుటుంబీకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సీనియర్ పోలీసు అధికారులు తక్షణమే చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కొన్ని గంటల్లోనే బాలికను ఢిల్లీ నుంచి సురక్షితంగా తీసుకొచ్చారు. అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కుటుంబసభ్యులు ఒత్తిడి…
యూపీలో గ్యాంగ్ రేప్ ఘటన వెలుగులోకి వచ్చింది. గోండా జిల్లాలోని ఖోదరే పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినులను నలుగురు యువకులు బైక్‌లపై కిడ్నాప్ చేసి అడవుల్లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు.