వ్యాక్సినేష‌న్‌లో ఇండియా మ‌రో రికార్డ్‌… ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా…

క‌రోనా మ‌హమ్మారికి చెక్ పెట్టాలి అంటే వ్యాక్సిన్ ఒక్క‌టే ప్ర‌స్తుతానికి ఉన్న మార్గం కావ‌డంతో వ్యాక్సినేష‌న్‌ను వేగంగా అమ‌లుచేస్తున్నారు.  ప్ర‌తిరోజూ 60 ల‌క్ష‌ల మందికి పైగా వ్యాక్సిన్ అందిస్తున్నారు.  కాగా ఇప్పుడు ఇండియా వ్యాక్సినేష‌న్‌లో వ‌ర‌ల్డ్ రికార్డ్‌ను సాధించింది.  ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం 75,89,12,277 మందికి టీకాలు అందించిన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది.  సెప్టెంబ‌ర్ వ‌ర‌కు దేశంలో పురుషుల‌కు 52.5 శాతం, మ‌హిళ‌ల‌కు 47.5శాతం ఇత‌రుల‌కు 0.02 శాతం డోసులు వేసిన‌ట్టుగా కేంద్రం పేర్కొన్న‌ది.  ఇప్ప‌టి వ‌ర‌కు వేసిన మొత్తం డోసుల్లో గ్రామీణ ప్రాంతాల్లో 62.54 శాతం ఉన్న‌ట్టు కేంద్రం వెల్ల‌డించింది.  దేశంలో మొత్తం 2,44,310 వ్యాక్స‌నేష‌న్ కేంద్రాలు ఉన్నాయ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు 18.1 కోట్ల మంది రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నార‌ని కేంద్రం తెలియ‌జేసింది.  

Read: ప్ర‌పంచంలో అత్యంత పురాత‌న‌మైన స‌మాధి అదే… సంద‌ర్శ‌న‌కు అనుమ‌తి…

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-