ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలు తప్పుకున్నాయి. పూర్తిగా సేనలు తప్పుకోవడంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితులు పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ టవర్స్‌పై ఉగ్రవాదుల దాడి తరువాత ఆఫ్ఘనిస్తాన్‌పై యుద్ధం ప్రకటించింది అమెరికా. సేనలు ఆఫ్ఘనిస్తాన్‌లోకి ప్రవేశించి ఉగ్రవాదులను తరిమికొట్టాయి. 2001లో ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేశాయి. 20 ఏళ్లపాటు ఆమెరికా రక్షణలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజాస్వామ్య ప్రభుత్వం నడిచింది. అమెరికా సేనలు ఉపసంహరించుకునే సమయానికి తిరిగి 2001 ముందునాటి పరిస్థితులు ఏర్పడ్డాయి. 20 ఏళ్ల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ కోసం అమెరికా రూ. 146 లక్షల కోట్ల ఖర్చు చేసింది. ఈ మొత్తాన్ని అమెరికా వివిధ రూపాల్లో అప్పులు తీసుకొచ్చి వినియోగించింది. 2050 వ సంవత్సరానికి వడ్డీతో సహా కట్టాల్సిన అప్పులు రూ.474.30 కోట్లుగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంత ఖర్చు చేసినా ఈ 20 ఏళ్లలో ఏం సాధించింది అంటే శూన్యమని చెప్పాలి. అమెరికా సేనలు ఉన్నన్నాళ్లు బాగానే ఉన్నా, ఇప్పుడు అమెరికా దళాలు వెనక్కి వెళ్లిపోవడంతో తిరిగి పాతకాలం నాటి పరిస్థితులు ఏర్పడ్డాయి.
Read: మళ్లీ పెరిగిన గ్యాస్ ధర… ఎంతంటే…!!