మళ్లీ పెరిగిన గ్యాస్ ధర‌… ఎంతంటే…!!

దేశంలో గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగాయి.  ప్ర‌తి నెలా గ్యాస్ కంపెనీలు ధ‌ర‌ల‌ను స‌వ‌రిస్తుంటాయి.  గ‌త‌నెల‌లో గ్యాస్ ధ‌ర‌లో ఎలాంటి మార్పులు లేక‌పోవ‌డంతో, ఈనెల కూడా అదేవిధంగా ఉంటుంద‌ని అనుకున్నారు. కానీ,ఈ సెప్టెంబ‌ర్ మాసానికి సంబందించి ధ‌ర‌లు పెంచుతూ గ్యాస్ కంపెనీలు నిర్ణ‌యం తీసుకున్నాయి.  వంట‌గ్యాస్ సిలిండ‌ర్‌పై రూ.25, వాణిజ్య గ్యాస్ సిలిండ‌ర్‌పై రూ.75 పెంచిన‌ట్టు గ్యాస్ కంపెనీలు పేర్కొన్నాయి.  పెరిగిన ధ‌ర‌లు ఈరోజు నుంచి అమ‌లులోకి రానున్నాయి.  తాజా పెరుగుద‌ల‌తో ఢిల్లీలో వంట‌గ్యాస్ ధ‌ర రూ.884.50కి చేర‌గా, 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.1693కి చేరింది. ముడి చ‌మురు ధ‌ర‌లు, డాల‌ర్‌తో రూపాయి విలువ ఆధారంగా సిలిండ‌ర్ ధ‌ర‌ల్లో మార్పులు ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు.  ఇక గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో వినియోగదారులు ఆందోళ‌న‌లు చెందుతున్నారు.  ఇప్ప‌టికే పెట్రోల్ ధ‌ర‌లు పెద్ద ఎత్తున పెరిగాయి.  లీట‌ర్ పెట్రోల్ దేశంలో వంద దాటింది. వంట‌గ్యాస్ ధ‌రలు సామాన్యుల‌ను అందుబాటులో లేకుండా పోయింది. 

Read:

Related Articles

Latest Articles

-Advertisement-