హైదరాబాద్ నగరం మరోసారి భక్తి జ్వాలతో ప్రకాశించింది. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నిర్వహించిన కోటి దీపోత్సవం 2025 పదమూడు రోజుల ఆధ్యాత్మిక యాత్ర విజయవంతంగా ముగిసింది.
Karthika Pournami: కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
Dussehra 2025: దసరా పండగను విజయదశమి అని కూడా పిలుస్తుంటారు. ఈ పండగకు హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలోని శుక్ల పక్షం 10వ రోజున దసరా పండుగ వస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీన్ని జరుపుకుంటారు.
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగా వైభవంగా సాగింది. అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. మిథిలా మైదానంలో ఈ కల్యాణ క్రతువును ఆలయ పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో భద్రాచలం వీధులన్నీ రామ నామస్మరణతో మార్మోగాయి.
దేశమంతటా అత్యంత ఉల్లాసంగా, ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుగుతున్నాయి. జనమంతా రంగుళకేళిలో తేలియాడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు వాటర్ గన్‌లను తీసుకుని రంగులు జల్లుకుంటూ ఉత్సాహాన్ని పంచుకుంటున్నారు. కాగా.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో మాత్రం 46 ఏళ్ల తర్వాత హోలీ ఘనంగా నిర్వహించారు. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారిగా నగరంలోని కార్తికేయ ఆలయంలో హోలీ వేడుకలు వైభవంగా జరిగాయి. భక్తులు, హిందువులు ఒకరినొకరు గులాల్ పూసుకుంటూ.. సంబరాలు జరుపుకున్నారు.
Maha Shivratri 2025: హిందూ పురాణాల ప్రకారం ప్రతి ఏడాది మాఘ మాసంలో క్రిష్ణ పక్ష చతుర్దశి తిధినాడు మహా శివరాత్రి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, శివుడు ఈ రోజు లింగ రూపంలో దర్శనమిచ్చాడని నమ్ముతారు. అంతేకాకుండా, పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కూడా ఇదే రోజున జరిగిందని పేర్కొనబడింది. హిందూ పంచాంగం ప్రకారం.. ప్రతి నెలా శివరాత్రి వస్తుంది. అయితే, మాఘ మాసంలో వచ్చే శివరాత్రిని మహా శివరాత్రిగా పిలుస్తారు. ఈ పవిత్రమైన…
Dubba Rajanna Swamy: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని పెంబట్ల గ్రామంలో వెలిసిన దుబ్బ రాజన్న స్వామి వారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా 2.50లక్షల మందికిపైగా భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్సవాల షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 24న…
Mahakumbh 2025 : దేశం, ప్రపంచం నలుమూలల నుండి భక్తులు ‘మహా కుంభమేళా 2025’ కు చేరుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మహా కుంభమేళాలో స్నానమాచరించే భక్తుల సంఖ్య ఇప్పటివరకు 50 కోట్లు దాటింది.
Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా గుర్తించబడింది, ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రధానంగా జరుగుతోంది. ఈ వేడుకలో లక్షలాది మంది భక్తులు, పుణ్యస్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమంలో చేరి గంగామాతకు మనసారా పూజలు చేస్తున్నారు. ఈ వేడుక జనవరి 13న ప్రారంభమై, ఫిబ్రవరి 26 వరకు దాదాపు నలభై అయిదు రోజులపాటు కొనసాగుతుంది. పండితుల ప్రకారం, కుంభమేళా పుణ్యస్నానాలకు ప్రాముఖ్యతను ఇవ్వడం, గంగమ్మతల్లిని ఆచారమయిన విధంగా పూజించడం అత్యంత…