Gehlot vs Pilot: రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం.. గెహ్లాట్-పైలట్ అంశంపై సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు తలనొప్పిగా మారింది. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో సంక్షోభం ఏర్పడింది. గత కొద్దిరోజులుగా సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం, యువనేత సచిన్ పైలట్ మధ్య పోరు కొనసాగుతోంది. గెహ్లాట్‌పై పైలట్ తిరుగుబాటుకి నాయకత్వం వహించడంతో 2020లో ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రంగా బయటపడ్డాయి. ఇద్దరు నేతలు గతంలోనూ పలు సందర్భాల్లో పరస్పరం విమర్శలు చేసుకున్నారు.
Also Read:Sale of Cow: ఆ ఆవు ధర రెండు లక్షలు..
సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సచిన్ పైలట్ నిర్వహించిన నిరాహార దీక్షపై హైకండ్ సీరియస్ గా ఉంది. గెహ్లాట్ వర్సెస్ పైలట్ వ్యవహారం అసెంబ్లీ ఎన్నికలపై పడే అవకాశం ఉందని పార్టీ అగ్రనాయకత్వం గ్రహించింది. ఈ నేపథ్యంలో నష్టనివారణ చర్యలు చేపట్టింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్‌లకు సంబంధించిన పరిస్థితిని పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ గురువారం సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు ధృవీకరించాయి. ఈ సమావేశానికి సచిన్ పైలట్‌ని కూడా పిలిచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
Also Read:Opposition Unity: నితీష్ తో కేజ్రీవాల్ భేటీ.. ప్రతిపక్షాల ఐక్యతపై చర్చ!
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
దీనికి సంబంధించి రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ సుఖ్‌జిందర్ రంధావా ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమై ప్రస్తుత పరిస్థితిని వివరించారు. సచిన్ పైలట్ లేవనెత్తిన అవినీతి అంశాన్ని తాను అంగీకరిస్తున్నాను అని సుఖ్‌జిందర్ రంధావా అన్నారు. కానీ అతని పద్ధతి తప్పు అని, పైలట్ ఆ అంశాన్ని అసెంబ్లీ సమావేశాలలో లేవనెత్తాలి అని చెప్పారు. సచిన్ పైలట్‌తో అరగంట చర్చ జరిగిందని, అన్ని విషయాలను విశ్లేషించి నివేదికను సిద్ధం చేశారు. సవివరమైన నివేదికను పార్టీ అధిష్టానానికి సమర్పించారు. రాంధావా నుంచి నివేదిక తీసుకున్న తర్వాత ఖర్గే రాహుల్‌తో కూడా చర్చించారు. ఇప్పుడు రాహుల్ దీనిపై సోనియాతో చర్చించనున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు గాంధీ కుటుంబం అభిప్రాయాన్ని తీసుకుంటారు. ఖర్గేదే తుది నిర్ణయం’ అని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Also Read:Deputy CM Narayana Swamy: దళితుడిననే కదా ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు.. డిప్యూటీ సీఎం ఆవేదన..
రాజస్థాన్‌లోని అధికార కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కి వ్యతిరేకంగా పైలట్ నిరాహార దీక్ష చేశారు. గత బీజేపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేయాలని దీక్ష చేశారు. అయతే, దీక్షలో సచిన్ పైలట్ మద్దతుదారులు మినహా పెద్ద కాంగ్రెస్ నేతలు పాల్గొనలేదు. ఎన్నికల వేళ పైలట్ తీరుతో రాష్ట్రంలో కాంగ్రెస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. బిజెపి ప్రభుత్వ హయాంలో అవినీతిపై చర్యలకు డిమాండ్ చేస్తూ పార్టీ నాయకుడు సచిన్ పైలట్ చేసిన పగటిపూట నిరాహార దీక్షను కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించింది, ఇది పార్టీ ప్రయోజనాలకు విరుద్ధమని, పార్టీ వ్యతిరేక చర్య అని పేర్కొంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!