Congress: కాంగ్రెస్ పార్టీ వరస వైఫల్యాలపై ఆవేదన చెందిన ఒడిశాకు చెందిన మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సోనియా గాంధీకి సంచలన లేఖ రాశారు. కాంగ్రెస్‌కు చాలా సంస్కరణలు అవసమని ఆయన చెప్పారు. బారాబతి-కటక్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ మొక్విమ్ డిసెంబర్ 8న సోనియా గాంధీకి ఐదు పేజీల లేఖ పంపారు. లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ ఓటములు, 2024 నుంచి బీహార్, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, ఒడిశా పరాజయాలను ఆయన ప్రస్తావించారు. Read Also: Tej…
Shashi Tharoor: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ను ఆహ్వానించారు. శనివారం ఈ విందుపై థరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Congress: కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గత కొంత కాలంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు గుప్పించడం, బీజేపీ ప్రభుత్వ చర్యల్ని కొనియాడుతుండటంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహంగా ఉంది. ఇదిలా ఉంటే, తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇచ్చిన స్టేట్ డిన్నర్ కార్యక్రమానికి శశి థరూర్‌కు ఆహ్వానం అందింది.
Putin dinner: విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు, ప్రతిపక్ష నేతలను కలవకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని, గతంలో ఇలాంటి సంప్రదాయం ఉండేది కాదని పుతిన్ పర్యటనకు ముందు రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలు వచ్చిన ఒక రోజు తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది.
Banana Price Drop in AP: అగ్గిపెట్ట కన్నా అరటి చవకగా మారిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఎంపీ హర్షకుమార్.. అయితే, ఆంధ్ర అరటి గురించి పార్లమెంట్లో చర్చించండి అంటూ కాంగ్రెస్ ఎంపీ, ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్‌కు లేఖ రాశారు.. ఆంధ్రప్రదేశ్‌లో అరటి పంటకు కిలో ధర కేవలం యాభై పైసలకు పడిపోవడం రైతులకు తీవ్ర ఆవేదన, ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఈ పరిస్థితిపై పార్లమెంటు సమావేశాల్లో చర్చ జరగాలని మాజీ…
Karnataka Congress: కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ కొనసాగుతూనే ఉంది. సిద్ధరాయమ్యను దించేసి, డీకే శివకుమార్‌ను అధిష్టానం సీఎంగా చేస్తుందా.? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇరు వర్గాలు కూడా తమ బాస్‌లకే సీఎం పదవి ఉండాలని బలంగా కోరుకుంటున్నాయి.
DK Shivakumar: కర్ణాటకలో పవర్ షేరింగ్ వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ విషయంలో హై కమాండ్ అన్ని రకాలుగా చర్చించి నిర్ణయం తీసుకుంటుందని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఇటీవల సీఎం సిద్ధరామయ్య ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన ట్వీట్ చేశారు. తమ మాటను నిలబెట్టుకోవడమే నిజమైన బలం.. జడ్జి అయినా, అధినేత అయినా, నేనైనా ఎవరయినా సరే మాట నిలబెట్టుకోవాల్సిందే అంటూ…
Congress: కర్ణాటక కాంగ్రెస్‌లో పొలిటికల్ డ్రామా కొనసాగుతూనే ఉంది. రెండు పవర్ సెంటర్స్ అయిన సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గాల మధ్య పోరు ముదిరింది. ఈ సమస్య ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ముందుంది. కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో 2.5 ఏళ్లు సీఎం పదవిని పంచుకోవాలని అప్పట్లో కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పందం చేసింది.
Karnataka Politics: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన నివాసంలో పలువురు కర్ణాటక ఎమ్మెల్యేలను కలిశారు. ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, ఈ సమావేశం గురించి భద్రతా విభాగానికి సమాచారం ఇవ్వకపోవడంతో గేట్ వద్ద హడావుడి కొనసాగింది. తరువాత మల్లికార్జున్ ఖర్గే రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేలతో సమావేశమై వారి సమస్యలను విన్నారు. ఇదిలా ఉండగా.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఎమ్మెల్యేల ఢిల్లీ పర్యటన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.…
Congress Minister: కర్ణాటక మైనారిటీ వ్యవహారాల మంత్రి బీజెడ్ జమీర్ అహ్మద్ ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పేలుడుపై అనుమానాలు వ్యక్తం చేశారు. బీహార్ ఎన్నికలకు ఒక రోజు ముందు పేలుడు జరిగిందని, పేలుడు సమయాన్ని ప్రశ్నించారు. బెంగళూర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ పేలుడు ఘటనపై కేంద్రం హోం మంత్రి అమిత్ షా సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.