Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం
- వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ కాంగ్రెస్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PPCC) నూతన అధ్యక్షుడిగా పర్గత్ సింగ్‌ను కాంగ్రెస్ నియమించింది. శుక్రవారం అమరీందర్ సింగ్ రాజా వరంగ్ తన పదవికి రాజీనామా చేసిన కొద్ది నిమిషాలకే ఈ నియామకం జరిగింది.
ఎవరీ పర్గత్ సింగ్?
Also Read
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
పర్గత్ సింగ్ మాజీ భారత హాకీ కెప్టెన్, ఒలింపియన్. క్రీడా రంగంలో తన కెరీర్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆయన పంజాబ్‌లో క్రీడలు, విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం జలంధర్ కాంట్ నియోజకవర్గం నుంచి పంజాబ్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రాజా వరంగ్ స్థానంలో..
పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాలుగేళ్లకు పైగా కొనసాగిన అమరీందర్ సింగ్ రాజా వరంగ్ ఇటీవల పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. పంజాబ్‌లో పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లు, బలాలు, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై రాహుల్ గాంధీతో చర్చించినట్లు వరంగ్ తెలిపారు. రాజీనామా అనంతరం పార్టీకి ఎప్పుడు తన సేవలు అవసరమైనా అందుబాటులో ఉంటానని వరంగ్ చెప్పారు.
పంజాబ్‌లో 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంలో ఈ మార్పు చోటుచేసుకుంది. పంజాబ్ కాంగ్రెస్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో రాజా వరంగ్ రాజీనామా చేశారు. అంతకుముందు పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్గా ఉన్న భూపేశ్ బఘేల్ స్థానంలో సచిన్ పైలట్‌ను నియమించారు.
తాజావార్తలు
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..