Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- పంజాబ్ ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్
- కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- రాహుల్‌గాంధీని కలిసిన తర్వాత రాజీనామా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వరంగ్ తన పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిసిన అనంతరం తన రాజీనామా లేఖను ఆయనకు సమర్పించారు. పంజాబ్ కాంగ్రెస్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
రాజీనామా అనంతరం రాజా వరంగ్ రాహుల్ గాంధీతో సమావేశమైన విషయాన్ని వెల్లడించారు. పంజాబ్‌లో కాంగ్రెస్ ఎదుర్కొంటున్న సవాళ్లు, పార్టీ బలాలు, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై ఆయనతో చర్చించినట్లు తెలిపారు. రాహుల్ గాంధీ తనకు ఎంతో ఆప్యాయత చూపించారని, పంజాబ్‌లో ప్రభుత్వం, రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహాలపై వివరాలు అడిగారని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో పంజాబ్ కాంగ్రెస్‌ను నడిపించే అవకాశం ఇచ్చినందుకు రాహుల్‌కు కృతజ్ఞతలు తెలిపినట్లు పేర్కొన్నారు. పార్టీకి ఎప్పుడు తన సేవలు అవసరమైనా అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.
Also Read
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
- Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సచిన్ పైలట్‌పై ఆరోపణలు
తన రాజీనామాకు కాంగ్రెస్ పంజాబ్ ఇన్చార్జ్, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సచిన్ పైలట్ కారణమై ఉండొచ్చని రాజా వరంగ్ అభిప్రాయపడ్డారు. అయితే దీనికి తన దగ్గర ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేవని కూడా స్వయంగా చెప్పారు. సచిన్ పైలట్‌ను పంజాబ్ ఇన్చార్జ్గా నియమించినప్పుడు ఆయనను అధికారికంగా కలిసి అభినందించానని, సుమారు 15 నిమిషాలు మాట్లాడానని వరంగ్ తెలిపారు. ఆ తర్వాత మాత్రం పైలట్‌ను కలవలేదని చెప్పారు.
రాజా వరంగ్ సుమారు నాలుగున్నరేళ్ల పాటు పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగారు. 2022లో ఆయనను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించారు. ఆయన పదవీకాలంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో పలు వర్గాల మధ్య విభేదాలు కొనసాగినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ వర్గానికి, వరంగ్‌కు మధ్య విభేదాలపై చర్చ జరిగింది. ఇటీవల భూపేశ్ బఘేల్ స్థానంలో సచిన్ పైలట్‌ను పంజాబ్ కాంగ్రెస్ ఇన్చార్జ్గా నియమించిన తర్వాత రాష్ట్ర పార్టీ పరిస్థితిపై ఆయన నేతలు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
వరంగ్ రాజీనామాతో పంజాబ్ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడిని నియమించే ప్రక్రియపై చర్చ మొదలైంది. మాజీ మంత్రి, మాజీ ఎంపీ విజయ్ ఇందర్ సింగ్లా పేరు పరిశీలనలో ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. జలంధర్ కాంట్ ఎమ్మెల్యే పర్గత్ సింగ్, మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, గురుదాస్‌పూర్ ఎంపీ సుఖ్జిందర్ సింగ్ రంధావా తదితరుల పేర్లు కూడా చర్చలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే కొత్త అధ్యక్షుడిపై తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్ఠానానిదే. వచ్చే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న ఈ నాయకత్వ మార్పు.. పార్టీ అంతర్గత సమీకరణాలపై చర్చకు దారితీసింది.
తాజావార్తలు
-
Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
-
OTR: లోకల్ ఎలక్షన్స్‌లో జనసేనకు టీడీపీ షాక్? సీట్లపై కోల్డ్ వార్
-
Abhishek Sharma: షాకింగ్ డెసిషన్.. సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వీడనున్న అభిషేక్ శర్మ..?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!