కేంద్రంలోని మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా దేశంలోని విపక్ష పార్టీలన్నీ ఏకం అవుతున్నాయి. 2024 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అందరు కలిసి కట్టుగా ఉండి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో బిహార్ సీఎం నితీష్ కుమార్ ముందడుగు వేశారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నాయకులను కలుస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బిహార్ సీఎం నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌లను కలిశారు. ఢిల్లీలో జరిగిన వీరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో నితీష్ కుమార్, తేజస్వీ యాదవ్ చర్చలు జరిపిన కొన్ని గంటల తర్వాత అరవింద్ కేజ్రీవాల్ భేటీ జరిగింది. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష పార్టీల ప్రధానమైన ఊహాగానాలకు దారితీసింది.
Also Read:Nawazuddin Siddiqui: సోదరుడిపై పరువు నష్టం కేసు.. 100 కోట్ల దావా వేసిన బాలీవుడు నటుడు
ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి నితీష్ మంచి చొరవ తీసుకున్నారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. నితీష్ కు మద్దతు ఇస్తున్నట్లు ప్రటించారు. దేశం చాలా కష్టకాలంలో నడుస్తోందని, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని తాను చాలాసార్లు చెప్పాను అని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం బిజెపితో తీవ్ర పోటీని కలిగి ఉంది. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని తరచుగా ఆరోపిస్తోంది.
2024 ఎన్నికల కోసం విపక్షాల ఐక్యతను పటిష్టం చేయడంపై దృష్టి సారించి కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్) అగ్రనేతల అధికారిక సమావేశం రాజకీయంగా ఆసక్తి రేపింది. పలు అంశాలపై చర్చించి అన్ని పార్టీలను కలుపుకొని రానున్న ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని నిర్ణయించారు. ఇతర నాయకులు తన వెంట ఉన్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు.
Also Read:MK Stalin Urges : గవర్నర్ వర్సెస్ సర్కార్.. బీజేపీయేతర రాష్ట్రాలకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
బీహార్ ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలో మరిన్ని పార్టీలను ఏకం చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. ఢిల్లీలో మరికొందరు ప్రతిపక్ష నేతలతో కుమార్ భేటీ అయ్యే అవకాశం ఉంది. డిఎంకెకు చెందిన ఎంకె స్టాలిన్, సేన చీఫ్ ఉద్ధవ్ థాకరేతో సహా ఇతరులతో కూడా మాట్లాడి బిజెపికి వ్యతిరేకంగా సారూప్య పార్టీలను ఏకం చేసే ప్రయత్నంలో ఉన్నారు. కాగా, బీహార్‌లో జేడీ(యూ), రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్‌లు సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నాయి.