JR NTR: జూనియర్ ఎన్టీఆర్ తన నివాసంలో కొంతమంది సెలబ్రిటీలకు డిన్నర్ ఇచ్చారు. RRR సినిమాలో భీమ్ పాత్రతో తారక్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ పేరు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగుతోంది. ఈ సందర్భంగా ఆయన తన సన్నిహితులు, కుటుంబ సభ్యులకు విందుకు ఆహ్వానించారు. జూనియర్ ఎన్టీఆర్ నివాసంలో అమెజాన్ స్టూడియోస్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్ కోసం ఈ డిన్నర్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విందుకు ట్రిపుల్ డైరెక్టర్ రాజమౌళితో పాటు సినీ నిర్మాతలు మైత్రి మూవీస్ నవీన్, శిరీష్ రెడ్డి, బాహుబలి నిర్మాతలు శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవిని, ఆయన తదుపరి సినిమా దర్శకుడు కొరటాల శివ హాజరయ్యారు. స్పెషల్ డిన్నర్ పార్టీకి సంబంధించిన ఫోటోలను తారక్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తారక్ తన 30వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ డిన్నర్ పార్టీ పెట్టడం వెనుక ఆంతర్యం ఇంకా పూర్తిగా తెలియలేదు.
Read also: Google Pay: గుడ్‌న్యూస్ చెప్పిన గూగుల్ పే.. ఇక, ఆ సేవలు ఫ్రీ
అయితే ఈ విందులో జేమ్స్ ఫారెల్ వంటి వారు మరియు సినీ పరిశ్రమకు చెందిన కొద్దిమంది ప్రముఖులు మాత్రమే పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. ఈఫోటోలను షేర్ చేస్తూ తారక్ తన స్నేహితులు, శ్రేయోభిలాషులతో సరదాగా గడపడం చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశాడు. జేమ్స్ మరియు ఎమిలీని కలవడం చాలా బాగుంది. మీ మాటను నిలబెట్టుకున్నందుకు మరియు విందు కోసం మాతో చేరినందుకు ధన్యవాదాలు, ”అని తారక్ తన వ్యాఖ్యను పంచుకున్నాడు. తారక్ ఇచ్చిన ఈ విందుకి, భవిష్యత్తులో చేయబోయే సినిమాలకు ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. కేవలం తనకు నచ్చిన వారిని మర్యాదపూర్వకంగా భోజనానికి పిలుస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విందుకు దర్శకుడు నాగవంశీ, స్వప్న దత్ కూడా హాజరయ్యారు. కానీ ముందుగానే వెళ్లిపోయారు. సుకుమార్‌కి ఆహ్వానం అందినప్పటికీ, పుష్ప 2 కోసం వైజాగ్‌లో బిజీగా ఉన్నందున రాలేకపోయినట్లు తెలుస్తోంది. దిల్ రాజుకు కూడా ఆహ్వానం అందింది కానీ ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. ఈఫోటోలో దిల్ రాజు సోదరుడు కనిపిస్తున్నాడు. అయితే ఇందులో మెగా హీరో లేడనే చర్చ సాగుతోంది. ఊహించని సమావేశంలో, జేమ్స్ మరియు ఎమిలీ ఈ విందుకు ప్రత్యేకంగా రావడం…ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్ సహనటుడు రామ్ చరణ్ విందుకు హాజరు కాకపోవడంపై విస్తృత చర్చ జరుగుతోంది.
An evening well spent with friends and well wishers. Was great catching up with James and Emily. Thanks for keeping your word and joining us for dinner. pic.twitter.com/Zy0nByHQoq
— Jr NTR (@tarak9999) April 12, 2023