RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- అక్టోబర్ 1 నుంచి బాధ్యతలు
- ఆర్బీఐలో మూడు దశాబ్దాల అనుభవం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. సుధాకర్ మల్లిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించింది. ఈ నియామకం అక్టోబర్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి డిపార్ట్మెంట్ ఆఫ్ సూపర్విజన్ బాధ్యతలను పర్యవేక్షించనున్నారు. ఇంతకు ముందు ఇదే విభాగంలో చీఫ్ జనరల్ మేనేజర్-ఇన్-చార్జ్‌గా పనిచేశారు. తాజాగా ఆయనకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పదోన్నతి లభించింది.
మూడు దశాబ్దాల అనుభవం
సుధాకర్ మల్లి సుమారు మూడు దశాబ్దాలుగా సెంట్రల్ బ్యాంకింగ్ రంగంలో పనిచేస్తున్నారు. ఇందులో రెండున్నర దశాబ్దాలకు పైగా బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, సహకార బ్యాంకుల పర్యవేక్షణలో అనుభవం ఉంది. అలాగే విదేశాల్లోని పలు జ్యూరిస్డిక్షన్లలో సుమారు ఐదేళ్ల పాటు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించారు. కరెన్సీ మేనేజ్మెంట్ విభాగంలోనూ ఆయన పనిచేసినట్లు ఆర్బీఐ తెలిపింది.
Also Read
- Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
- రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
- SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
- Sugar Stock Limit: షుగర్ వ్యాపారులకు షాక్.. నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు
విద్యార్హతలు ఇవే..
సుధాకర్ మల్లి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పట్టా పొందారు. అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్ (CAIIB) సర్టిఫైడ్ అసోసియేట్‌గా ఉన్నారు. ఆర్బీఐలో పర్యవేక్షణ విభాగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న మల్లికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు అప్పగించినట్లు కేంద్ర బ్యాంకు వెల్లడించింది.
తాజావార్తలు
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
-
Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!