Congress: కాంగ్రెస్ పార్టీ వరస వైఫల్యాలపై ఆవేదన చెందిన ఒడిశాకు చెందిన మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే సోనియా గాంధీకి సంచలన లేఖ రాశారు. కాంగ్రెస్‌కు చాలా సంస్కరణలు అవసమని ఆయన చెప్పారు. బారాబతి-కటక్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ మొక్విమ్ డిసెంబర్ 8న సోనియా గాంధీకి ఐదు పేజీల లేఖ పంపారు. లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ ఓటములు, 2024 నుంచి బీహార్, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, ఒడిశా పరాజయాలను ఆయన ప్రస్తావించారు. Read Also: Tej…
Rajasthan: రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీ రాజకీయాలంటే మొదట మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మధ్య విభేదాలే గుర్తుకు వస్తాయి. ఈ క్రమంలో శనివారం వీరిద్దరూ సమావేశం అయ్యారు. గెహ్లాట్ నివాసంలో జరిగిన ఈ భేటీ చర్చనీయాంశంగా మారింది.
రాజస్థాన్ పర్యటనలో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీకి వింత పరిస్థితి ఎదురైంది. సవాయి మాధోపూర్‌లోని రణతంబోర్ జాతీయ ఉద్యానవనానికి రాహుల్‌గాంధీ వెళ్తుండగా సడన్‌గా కారు ఆపి.. కాంగ్రెస్ కార్యకర్త చుట్టన్ లాల్ మీనాను పలకరించారు.
ఈ లోక్ సభ ఎన్నికల ఫలితాలు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ప్రజలు తిరస్కరించినట్లు కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఆరోపించారు. అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించొద్దని వ్యాఖ్యానించారు.
Omar Abdullah: ప్రధాని నరేంద్రమోడీపై వ్యక్తిగత విమర్శలు ప్రతిపక్షాలకే ఎదురుదెబ్బగా మారుతున్నాయని జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. భారతదేశం పేదగా మారితే, బీజేపీ ధనవంతమైందని ఆరోపించారు. శనివారం ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2024లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీపై వ్యతిగత దాడికి దిగిన ప్రతీసారి అది బూమరాంగ్ అవుతోందని అన్నారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ కీలక సంస్థాగత మార్పులు చేపట్టింది. పలు రాష్ట్రాలకు ఇంఛార్జులను కేటాయించారు. కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. కాంగ్రెస్ ఉత్తర్ ప్రదేశ్ ఇంఛార్జ్‌గా ఉన్న ప్రియాంకాగాంధీన వాద్రాను ఆ స్థానం నుంచి తప్పించారు. ఆమె స్థానంలో యూపీ ఇంఛార్జ్‌గా అవినాష్ పాండేని నియమించింది.
Rajasthan : రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఈ సర్వేలో కాంగ్రెస్‌దే పైచేయి అని ఒకరు చెప్పగా, బీజేపీకి విజయం దక్కనున్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే గట్టిపోటీ ఉందని స్పష్టమవుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని రాజస్థాన్ ఎమ్మెల్యే సచిన్ పైలెట్ తెలిపారు. ప్రజల్లో మంచి స్పందన ఉంది.. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీల పర్యటనలకు మంచి స్పందన వస్తుందని ఆయన పేర్కొన్నారు.
రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ స్థానాల్లో 199 స్థానాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. . రాజస్థాన్ ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను.. కాంగ్రెస్ పార్టీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని నేను భావిస్తున్నాను అంటూ ఆయన తెలిపారు.
9.77% voting till 9 am in Rajasthan: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద జనాలు బారులు తీరారు. ఉదయం 9 గంటల వరకు 9.77 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. తొలి 2 గంటల్లో చాలా మంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత…