Rajasthan: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఈ సారి ఎన్నికల్లో సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ పరాజయం పాలవుతారని రెండు ఎగ్జిట్ పోల్స్ అంచానా వేశాయి. 200 స్థానాలు ఉన్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీగా ప్రచారం చేశాయి.
Rajasthan: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ర్యాలీ కోసం వీఐపీ డ్యూటీ కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఆరుగురు పోలీసులు మృతి చెందారు. ఒకరు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ప్రమాదం ఆదివారం రోజున చురు జిల్లాలోని సుజన్‌గఢ్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కనోటా పోలీస్ పోస్ట్ ఏరియాలో పోలీస్ సిబ్బందితో వెళ్తున్న వాహనం ట్రక్కును ఢీకొట్టింది. వీరంతా ఝంజులో జరిగే ప్రధాన మంత్రి ర్యాలీ కోసం డ్యూటీ చేసేందుకు వెళ్తున్నారు.
PM Modi: రాజస్థాన్ పోలింగ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్, బీజేపీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్రంలో పర్యటించారు. భరత్ పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు విధానంతో సంఘ విద్రోహ శక్తులకు అవకాశం ఇస్తోందని మండిపడ్డారు. నేరాలు, అల్లర్లలో రాష్ట్రాన్ని టాప్ ప్లేస్‌లో ఉంచిందని విమర్శించారు.
Congress: రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి లుకలుకలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ వర్గాలుగా చీలిపోయింది. మరోసారి ఈ వివాదం తెరపైకి వచ్చింది. వచ్చే నెలలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర పోరు నెలకొంది.
PM Modi: కాంగ్రెస్ టార్గెట్‌గా మరోసారి ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మోడీ పర్యటించారు. ‘పేపర్ లీక్ మాఫియా’ రాజస్థాన్ లోని లక్షలాది మంది యువత భవిష్యత్తును నాశనం చేసిందని, సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జోధ్‌పూర్ లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన ప్రతీ అవినీతి తమ వద్ద ఉందని, దానిని బయటకు తీసుకురావాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని మోడీ అన్నారు.
PM Modi: కాంగ్రెస్ పార్టీ, అశోక్ గెహ్లాట్ లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది ఉదయ్‌పూర్‌లో దారుణంగా మతోన్మాదులు చేతిలో హత్యకు గురైన కన్హయ్య లాల్ అంశాన్ని మోడీ ప్రస్తావించారు.
State Elections: ఈ ఏడాది చివర్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ముఖ్యంగా జాతీయపార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గెలవాలని భావిస్తున్నాయి. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం ఉన్నాయి. వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Ashok Gehlot: కాంగ్రెస్ నేత , రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు ఆ రాష్ట్ర హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. న్యాయవ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా రాజస్థాన్ హైకోర్టు శనివారం ఈ నోటీసులు జారీ
రాజస్థాన్‌లోని కోటాలో జరుగుతున్న విద్యార్థుల మృతిపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సీరియస్ అయ్యారు. విద్యార్థుల మరణాలను నిరోధించడానికి కమిటీని ఏర్పాటు చేశారు.
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు హస్తం పార్టీ ప్లాన్ రెడీ చేస్తుంది. మరోసారి విజయం సాధించడం కోసం వ్యూహాలను రచించేందుకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ అగ్ర నేతలు ఇవాళ( గురువారం) భేటీ అయ్యారు. సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి సుఖ్‌జిందర్ రణధవా, ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్…