Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదన్న అక్బరుద్దీన్
- “నేను ముసలోడిని అయిపోయాను.. చేయను” అంటూ వ్యాఖ్యలు
- ఎంఐఎం కీలక నేత వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ
- తర్వాతి ఎన్నికల్లో అక్బరుద్దీన్ నిర్ణయంపై ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాతబస్తీ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నేతగా గుర్తింపు పొందిన ఎంఐఎం (AIMIM) శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తికర చర్చకు తెరలేపాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానో లేదో తెలియదని, ప్రస్తుతానికి అసలు ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన కూడా తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. దశాబ్దాలుగా చురుగ్గా రాజకీయాల్లో ఉంటూ వరుస విజయాలు సాధిస్తున్న అక్బరుద్దీన్ చేసిన ఈ అనూహ్య ప్రకటన ఇప్పుడు పాతబస్తీ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.
“నేను ముసలోడిని అయిపోయాను..”
తన భవిష్యత్తు పోటీపై మాట్లాడిన అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. “నేను ముసలోడిని అయిపోయాను. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు. అసలు పోటీ చేయాలనే ఆలోచన కూడా లేదు.. నేనైతే చేయను” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎంఐఎం పార్టీకి పాతబస్తీలో ప్రధాన బలంగా, అసెంబ్లీలో ప్రతిపక్షాలను సమర్థవంతంగా ఎదుర్కొనే కీలక నాయకుడిగా ఉన్న అక్బరుద్దీన్ నోటి నుంచి ఈ మాటలు రావడం పార్టీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.
Also Read
పాతబస్తీ రాజకీయాల్లో కొత్త మలుపు?
అక్బరుద్దీన్ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు అంతరార్థం ఏమిటనే దానిపై రాజకీయ విశ్లేషకులు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. నిజంగానే ఆయన రాబోయే ఎన్నికల నాటికి పోటీకి దూరంగా ఉంటారా లేదా పార్టీలో తర్వాతి తరం నాయకత్వానికి దారి ఇచ్చేందుకు ఈ వ్యాఖ్యలు చేశారా అనే కోణంలో చర్చ నడుస్తోంది. పాతబస్తీ నుంచి ఎంఐఎంను తిరుగులేని శక్తిగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన అక్బరుద్దీన్ ఒకవేళ నిజంగానే పోటీ నుంచి తప్పుకుంటే, అది పాతబస్తీ రాజకీయాల్లో ఒక కొత్త మలుపుగా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Kim Jong Un Death Rumors: కిమ్ జోంగ్ ఉన్ మృతిపై పుకార్లు.. కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
-
SS Rajamouli-Varanasi: ఆరేడు సినిమాలను కలిపి ఒకే చిత్రంగా.. ‘వారణాసి’పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Dussehra astrology: దసరా నుంచి ఈ 3 రాశుల వారికి త్రిగ్రాహి, లక్ష్మీనారాయణ, బుధాదిత్య యోగాలు..
-
Redmi Pad 3 లాంచ్‌కు ముందు స్పెసిఫికేషన్లు లీక్.. 10,000mAh బ్యాటరీతో రాక!
-
Sheikh Hasina: ‘చంపినా, అరెస్టు చేసినా వెనక్కి తగ్గను’.. బంగ్లాదేశ్‌కు వెళ్తానన్న హసీనా
ట్రెండింగ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!