వాతారవణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి. ఉత్తర దక్షిణ దృవాల వద్ధ ఉన్న మంచు భారీగా కరిగిపోతున్నది. ఫలితంగా సముద్రాల్లో నీటి మట్టం క్రమంగా పెరుగుతున్నది. దీంతో పాటుగా వాతారవణంలో వేడి కూడా పెరుగుతుండటంతో సకాలంలో వర్షాలు కురవడం లేదు. ఒకవేళ వర్షాలు కురవడం మొదలుపెడితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా వరదలు సంభవిస్తున్నాయి. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక నగరీకరణలో భాగంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల నుంచి ఉద్గార వామువులు విడుదలవుతున్నాయి. దీని వలన వాతావరణంలో వేడి పెరుగుతున్నది. ఈ వాయు కాలుష్యం పంటలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో పంటలు పండటం లేదు. సకాలంలో పంటలు పండకపోవడం ప్రజలు వలస బాట పడుతున్నారు. లాటిన్ అమెరికా, నార్త్ ఆఫ్రికా, సహారా ఆఫ్రికా, తూర్పు యూరప్, పసిఫిక్ వంటి ప్రాంతాల్లో సుమారుగా 216 మిలియన్ల మంది ప్రజలు 2025 నాటికి వారు నివశించే ప్రాంతాల నుంచి వలస వెళ్లే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తీరు మారాలి అంటే తప్పనిసరిగా వాతారణంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనించి తగిన చర్యలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
Read: భారీ వర్షాల్లోనూ పోలీసుల గస్తీ… ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్…