భారీ వ‌ర్షాల్లోనూ పోలీసుల గ‌స్తీ… ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ వైర‌ల్‌…

గుజ‌రాత్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.  రాజ్ కోట్‌లో కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా రోడ్లు పెద్ద చెరువులుగా మారిపోయాయి.  దీంతో ప్ర‌జలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  లోత‌ట్టు ప్రాంతాల్లో ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని పోలీసులు హెచ్చ‌రిస్తున్నారు. ఇక వ‌ర‌ద నీటిలో చిక్కుకున్న వారిని ర‌క్షించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.  రోడ్డుపై పెద్ద ఎత్తున వ‌ర‌ద నీరు ప్ర‌వ‌హిస్తున్న‌ప్ప‌టికీ పోలీసులు వెన‌క‌డుగు వేయ‌కుండా వాహ‌నాల్లో ప్రయాణిస్తున్నారు.  దీనిని సంబందించిన వీడియోను వ్యాపార దిగ్గ‌జం ఆనంద్ మ‌హీంద్ర ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.  సీరియస్‌లీ ? డూరింద్‌ ది రీసెంట్‌ రైన్స్‌ ? ఈవెన్‌ ఐమ్‌ ప్రెట్టీ అమేజ్డ్ అని ట్వీట్ చేశారు.  ఈ ట్వీట్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. 

Read: వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ మాదిరిగానే ఇక‌పై జైల్ ఫ్ర‌మ్ హోమ్…!!

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-