Gerogia Meloni: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె ప్రభుత్వం దేశవ్యాప్తంగా బుర్ఖా, నిఖాబ్‌లను నిషేధించే బిల్లును తీసుకువచ్చింది. ప్రధాని మెలోని నేతృత్వంలోని ఇటలీ పాలక పార్టీ బుధవారం దేశ పార్లమెంటులో ముస్లిం మహిళలు దేశవ్యాప్తంగా అన్ని బహిరంగ ప్రదేశాల్లో తమ ముఖాలను, శరీరాలను కప్పి ఉంచే బుర్ఖాలు, నిఖాబ్‌లను ధరించడాన్ని నిషేధించే బిల్లును ప్రవేశపెట్టింది. ఇటలీలో అధికార పార్టీ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ, ఇస్లామిక్ వేర్పాటువాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ బిల్లును తీసుకువచ్చినట్లు…
H-1B Visa Row: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా రుసుమును $100,000 (రూ. 88 లక్షలు)కు పెంచడం ఒక్కసారిగా భారతీయ టెక్కీలో ఆందోళన నింపింది. తమ అమెరికన్ డ్రీమ్స్‌ను ట్రంప్ కాలరాస్తున్నాడనే ఆవేదన వ్యక్తమైంది. H-1B వీసా ఫీజు పెంపు విషయం గందరగోళంగా మారుతున్న తరుణంలో మేము ఉన్నామంటూ ఓ యూరోపియన్ దేశం ముందుకు వచ్చింది. భారత టెక్కీలు తమ దేశానికి రావాలని ఆహ్వానించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై అక్కసు వెల్లగక్కకుతున్నాడు. భారత్ ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారు. అమెరికా విధించిన విధంగానే భారతదేశంపై ఆంక్షలు విధించాలని వైట్ హౌస్ యూరోపియన్ దేశాలకు విజ్ఞప్తి చేసిందని సమాచారం. ఈ ఆంక్షలలో యూరప్ భారతదేశం నుంచి చమురు, గ్యాస్ కొనుగోలును వెంటనే నిలిపివేయాలని ఉందని తెలిసింది. ఆగస్టు 27 నుండి అమెరికా భారతదేశంపై ఇప్పటికే 50 శాతం సుంకాన్ని విధించింది. అయితే, భారతదేశంపై సుంకాలకు సంబంధించి ఏ యూరోపియన్…
S Jaishankar: యూరోపియన్ యూనియన్ నేతలతో చర్చల కోసం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బ్రస్సెల్స్‌లో ఉన్నారు. ఈ పర్యటనలో పాకిస్తాన్ తీరును మరోసారి ఆయన ఎండగట్టారు. కాశ్మీర్‌లో ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఘర్షణను ఉగ్రవాదంపై భారత్ తీసుకుంటున్న చర్యలుగా చూడాలని, కేవలం ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యగా చూడొద్దని వెస్ట్రన్ దేశాలకు పిలుపునిచ్చారు.
Austria school shooting: యూరోపియన్ దేశం ఆస్ట్రియాలో ఓ ఉన్మాది నరమేధం సృష్టించాడు. గ్రాజ్‌లోని ఒక స్కూల్‌లో జరిపిన కాల్పుల్లో కనీసం 8 మంది మరణించగా, చాలా మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అనుమానితుడు విద్యార్థి అని తెలుస్తోంది. ఘటన తర్వాత నిందితుడు వాష్ రూంలో ఆత్మహత్య చేసుకుని కనిపించాడని ఆస్ట్రియన్ స్టేట్ మీడియా ఓఆర్ఎఫ్‌ని ఉటంకిస్తూ యూకేకి చెందిన ఇండిపెండెంట్ నివేదించింది. అయితే, అధికారుల నుంచి ఇంకా ధ్రువీకరణ రావాల్సి ఉంది. Read Also:…
S Jaishankar: యూరోపియన్ దేశాలపై మరోసారి భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాల ద్వంద్వ ప్రమాణాలను ఎండగట్టారు. ఆర్కిటిక్ సర్కిల్ ఇండియా ఫోరం సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూరోపియన్ దేశాలు భారత భౌగోళిక రాజకీయ వైఖరిని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. భారతదేశం ‘‘బోధించే వారి’’ కోసం కాదని, భాగస్వాములను కోరుకుంటుందని చెప్పారు.
ఇటలీ ప్రధాని మెలోనీ గురువారం అమెరికాలో పర్యటించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మెలోనీ సమావేశమై సుంకాలపై చర్చించారు. అన్ని దేశాలపై ట్రంప్ భారీగా సుంకాలు పెంచేశారు. దీంతో ప్రపంచ మార్కెట్లు ఘోరంగా దెబ్బ తిన్నాయి.
ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి 29న(రేపు) సంభవించనుంది. ఈ గ్రహణం మీన రాశిలో సంభవిస్తుంది. కానీ.. ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఇది పాక్షిక సూర్యగ్రహణం. ఈ ఏడాది మొదటి పాక్షిక సూర్యగ్రహణం యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రం, బార్బడోస్, బెల్జియం, ఉత్తర బ్రెజిల్, బెర్ముడా, ఫిన్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీన్లాండ్, హాలండ్, నార్వే, పోలాండ్, పోర్చుగల్, రొమేనియా, ఉత్తర రష్యా, స్పెయిన్, మొరాకో, ఉక్రెయిన్,…
నూతన సంవత్సరం వేళ యూరోపియన్ దేశాలకు రష్యా, ఉక్రెయిన్ దేశాలు షాకిచ్చాయి. ఐదు దశాబ్దాల నుంచి కొనసాగుతున్న గ్యాస్ రవాణాను జనవరి 1న న్యూఇయర్ సమయంలో అనూహ్యంగా నిలిపేసింది. దీంతో ఐరోపా దేశాలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
UK vs Russia: గత రెండేళ్లుగా రష్యా- ఉక్రెయిన్ల యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలో బ్రిటన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పలు సంచలన విషయాలు తెలిపింది. ఉక్రెయిన్‌కు సపోర్టుగా నిలిచిన బ్రిటన్‌లో అల్లకల్లోలం సృష్టించేందుకు రష్యా ప్రయత్నిస్తుందని ఎమ్ఐ5 ఏజెన్సీ ఆరోపించింది.