Whats Today: తిరుమల: రేపు ఆన్ లైన్ లో పిభ్రవరి నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చెయ్యనున్న టీటీడీ. రేపు మధ్యాహ్నం 3 గంటలకు వసతి గదుల కోటా విడుదల చెయ్యనున్న టీటీడీ.
ప్రకాశం : మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి టంగుటూరు మండలం తూర్పు నాయుడిపాలెంలోని క్యాంప్ కార్యాలయంలో ఉంటారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతిలో ఉంటారు.
నెల్లూరు : కందుకూరులో మాలల మహా గర్జన బహిరంగ సభ.. ముఖ్య అతిథులుగా హాజరుకానున్న వైసీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు, మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్.
ప్రకాశం : ఒంగోలు యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభల సందర్భంగా నగరంలో ర్యాలీ, ముఖ్య అతిథులుగా హాజరుకానున్న జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్..
ప్రకాశం : సీఎస్ పురం మండలం మిట్టపాలెం నారాయణ స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా పుష్ప యాగం..
నెల్లూరు: రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్డి… విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్నూలు: సుంకేసుల జలాశయంకు తగ్గుతున్న వరద.. ఇన్ ఫ్లో 3,813 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో. 3,820 క్యూసెక్కులు, ఒక గేటు ఎత్తివేత, డ్యాం పూర్తి సామర్థ్యం, 1.2 టిఎంసి.. ప్రస్తుత నీటి సామర్థ్యం 1.2 టిఎంసిగా ఉంది.
అనంతపురం: గుంతకల్ పట్టణంలోని బీరప్ప సర్కిల్ లో శ్రీ కనకదాసు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి సవిత.
తిరుపతి: తిరుపతిలోని ఆయుర్వేదిక్ మందుల షాపులపై విజిలెన్స్, డ్రగ్ కంట్రోల్, ఆయుష్ అధికారుల దాడులు. అనుమతి లేని మందులు విక్రయించిన ఒక షాపును , లైసెన్స్ లేని మరో షాపు సీజ్ చేసిన అధికారులు.
విజయవాడ: నేడు వక్ఫ్ బిల్ ఆమోదంపై అన్ని పార్టీల రౌండ్ రేబుల్ సమావేశం. హాజరుకానున్న కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నేతలు.
అల్లూరి సీతారామ రాజు జిల్లా: ఏజెన్సీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. పాడేరు లో 11, మిన్యూములూరు వద్ద 09 డిగ్రీలు నమోదు, ఏజెన్సీలో కొనసాగుతున్న చలి తీవ్రత. దట్టంగా కురుస్తున్న పొగ మంచు. చలి తట్టుకో లేక చలి మంటలను అశ్రయిస్తున్న స్థానికులు. పెరిగిన పర్యాటకుల తాకిడి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు అమలాపురంలో రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో లక్ష మందితో ఉభయ రాష్ట్రాల శెట్టిబలిజ కార్తీక వన సమారాధన. శెట్టి బలిజ కులస్తుల మధ్య ఐక్యత…ఇతర కులాలతో సఖ్యత ధ్యేయంగా మంత్రి కార్తీక వన సమారాధన
తూర్పుగోదావరి జిల్లా: నేడు రూడా చైర్మన్ గా బొడ్డు వెంకటరమణ చౌదరి ప్రమాణ స్వీకరం. రాజమండ్రి చెరుకూరి గార్డెన్స్ లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు.
తిరుపతి: 28వ తేది పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు.
అమరావతి: బెయిల్ షరతులు సడలించాలని ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్. పుంగనూరు అల్లర్ల కేసులో మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చిన హైకోర్టు. ప్రతినెల 1, 15 తేదీల్లో విచారణ అధికారి ముందు హాజరు కావాలని షరతు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున షరతులు సడలించాలని పిటిషన్ వేసిన మిథున్ రెడ్డి
తూర్పుగోదావరి జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పర్యటన కార్యక్రమాల వివరాలు.
ఉదయం 10 గంటల నుంచి మధ్నాహ్నం 1.30 గంటలకు వరకు పలు కార్యక్రమాల్లో మంత్రి కందుల దుర్గేష్ బిజీబిజీ.
హైదరాబాద్: నేడు (24-11-24) ఉదయం 9 గంటలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాధాపూర్ లోని శిల్పరామంలో జరుగుతున్న లోక్ మంథన్ భాగ్యనగర్ – 2024 కార్యక్రమాల్లో.. లోక్ మంథన్ రిసెప్షన్ కమిటీ చైర్మన్ హోదాలో లోక్ మంథన్ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఖమ్మం: జిల్లాలో నేడు మంత్రులు తుమ్మల, పొంగులేటి ల పర్యటన.
ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాను వణికిస్తున్న చలి. పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు. సింగిల్ డిజిట్ కు కనిష్ఠ ఉష్ణోగ్రతలు. ఏజెన్సీ లో దర్శనమిస్తున్న చలిమంటలు.
పెద్దపల్లి జిల్లా:నేడు ధర్మారం మండలంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పర్యటన. పత్తిపాక రిజర్వాయర్ స్థల పరిశీలన కోసం రానున్న మంత్రి. ఇరిగేషన్ అధికారులతో కలిసి మధ్యాహ్నం రిజర్వాయర్ కోసం స్థల పరిశీలన.
తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలకు పోటెత్తిన భక్తులు. ఆదివారం సెలవు కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులు. పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదులుతున్న మహిళలు. ముక్కంటిని దర్శించుకుని కార్తీక దీపాలు వెలిగిస్తున్న భక్తులు. శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు.
తెలంగాణ: హైదారబాద్ లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,000 వేలు కాగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,640 గా కొనసాగుతుంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 1,01,000 కొనసాగుతుంది.
IPL మెగా వేలం: ఈరోజు, రేపు ఇండియన్ ప్రిమియర్ లీగ్ మోగా వేలం. సౌదీ అరేబియాలో జెడ్డా వేదికగా మధ్యాహ్నం 3.30 గంటల నుంచి IPL వేలం. IPL మెగా వేలంలో రిషబ్‌పంత్ కు రికార్డ్ ధర పలికే ఛాన్స్.577 మంది ఆటగాళ్లకోసం పోటీపడుతున్న 10 ఫ్రాంచైజీలు. 577 మందిలో 397 మంది భారత ఆటగాళ్లు, 210 మంది విదేశీ ఆగగాళ్లు. 2025 మార్చి 14 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం.
ఢిల్లీ: ఇవాళ ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు ఆధ్వర్యంలో భేటీ కానున్న అఖిల పక్షం. రేపటి నుంచి డిసెంబర్ 20 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు. శీతాకాల సమావేశాల్లో వివిధ పక్షాల నేతల అభిప్రాయాలపై అఖిలపక్షం. ఒకే దేశం- ఒకే ఎన్నిక, వక్ఫ్ బిల్లులకు చట్టరూపం ఇవ్వాలనే సంకల్పంతో మోడీ సర్కార్. ఈ సమావేశాల్లో ఈ రెండు బిల్లులను ఆమోదింప చేసుకోవాలని చూస్తున్న మోడీ ప్రభుత్వం. ఈ రెండు బిల్లులను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస నేతృత్వంలోని ఇండియా కూటమి. ప్రస్తుతం పార్టమెంటరీ సంయుక్త కమిటీ పరిశీలనలో ఉన్న వక్ఫ్ సవరణ బిల్లు-2024. ఒకేదేశం-ఒకే ఎన్నిక బిల్లు.. లోక్ సభో అన్ని రాష్ట్రాలు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు.
Hydrogen Train : మార్చిలో పట్టాలెక్కనున్న నీటితో నడిచే రైలు..