బ్లేడ్ బ్యాచ్ లిస్ట్ రెడీ..! గంజాయి బ్యాచ్ ఆస్తులు సీజ్.. హోం మంత్రి వార్నింగ్..
బ్లేడ్ బ్యాచ్ లిస్ట్ కూడా తయారవుతోందన్నారు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ.. గంజాయి నిర్మూలన, బ్లేడ్ బ్యాచ్ నిర్మూలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు.. బ్లేడ్ బ్యాచ్ లిస్ట్ కూడా తయారవుతోంది.. యాంటీ నార్కొటిక్ టీంను ఏర్పాటు చేశాం.. అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాం అన్నారు.. రౌడీషీట్లు, పీడీ యాక్ట్ కూడా పెడతాం అని వెల్లడించారు.. ఏజెన్సీల్లో పండే గంజాయి స్కూల్ బ్యాగుల్లోకి వచ్చేసింది అని ఆవేదన వ్యక్తం చేశారు.. గంజాయి నిర్మూలనకు చెక్ పోస్టులు పెంచాం.. సీసీ కెమెరాలు పెంచాం.. 25 వేల కేజీల గంజాయి సీజ్ చేసాం.. 916 మంది మీద కేసులు పెట్టామని వివరించారు. గంజాయి బ్యాచ్ వారి ఆస్తులు, ఐడెంటిటీలు సీజ్ చేస్తాం అని హెచ్చరించారు హోం మంత్రి అనిత.. డీ అడిక్షన్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేశామని వివరించారు.. ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసి సర్వాధికారాలు ఇచ్చాం.. రాజమండ్రి, విజయవాడ దగ్గర ఎక్కువగా బ్లేడ్ బ్యాచ్‌లను గుర్తించాం.. కడపలో బ్లేడ్ బ్యాచ్ ల అంశం మా దృష్టికి తెచ్చారు గనుక.. అక్కడ కూడా పని చేస్తాం అన్నారు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. కాగా, గత ఐదేళ్ల సమయంలోనే ఏపీ గంజాయి బ్యాచ్.. ఆ తర్వాత బ్లేడ్ బ్యాచ్ కోరల్లో చిక్కుకుపోయిందని ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తావించారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్.. గత ప్రభుత్వ హయాంలో గంజాయి నిర్మూలనకు చర్యలు తీసుకోలేదు.. కనీసం ఆ సమయంలో హోంశాఖ మంత్రి రివ్యూలు చేసిన సందర్భాలు కూడా లేవన్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్..
1,040 లిఫ్ట్ స్కీమ్‌ల్లో 450 మూత.. ఎత్తిపోతల పథకాలకు ప్రాధాన్యం..
లిప్ట్ స్కీమ్‌ల నిర్వహణ, మోటార్ల మరమ్మత్తులకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వగా వైఎస్ జగన్ ఎత్తిపోత పథకాలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. 1,040 లిఫ్ట్ స్కీమ్‌లకు గాను 450 లిఫ్ట్ స్కీమ్‌లు మూతపడ్డాయని ఆరోపించారు.. ఇక, తాళ్లూరు లిఫ్ట్ పైపులు సిథిలావస్థకు చేరిన మాట వాస్తవమే.. పుష్కర మెయిన్ కెనాల్ తాళ్లూరు లిఫ్ట్ బ్లాక్ కాటన్ సాయిల్ కావడం వల్ల బ్రేక్ అవుతోందన్నారు.. వార్షిక పద్ధతిలో తాళ్తూరు లిఫ్ట్ పై చర్యలు ఉంటాయన్నారు.. లిఫ్ట్ లు మొత్తం జీరో మెయింటెనెన్స్.. లిఫ్ట్ స్కీమ్ ల నిర్వహణ, మోటార్ల మరమ్మత్తులకు చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వగా.. జగన్ ఎత్తిపోతలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. గత పాలన కారణంగా లిప్ట్ స్కీమ్‌లు పని చేయకపోవడంతో 4 లక్షల ఎకరాలు బీడుగా మారిపోయానని విమర్శించారు.. తాళ్లూరు లిఫ్ట్ మాత్రమే కాదు, రాష్ట్రంలో అన్ని లిఫ్ట్ లు ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయన్నారు.. తాళ్లూరు లిఫ్ట్‌కు సంబంధించి పీఎస్‌సీ పైపుల స్థానంలో ఎమ్మెస్ పైపుల ఏర్పాటుకు అంచనాలు రూపొందిస్తున్నాం అని శాసన సభలో వెల్లడించారు ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు..
విశాఖ కాలుష్య నివారణకు చర్యలు.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
విశాఖపట్నంలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏపీ శాసన మండలి సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఆయన.. విశాఖ కాలుష్య నివారణకు, పరిశ్రమల నిర్వాహకులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాలుష్య నివారణ చేపడతాం అన్నారు.. పలాస జీడిపప్పు తొక్క కాల్చడం ద్వారా కూడా పెద్ద ఎత్తున కాలుష్యం వెలువ డేది.. కానీ, ఇప్పుడు ఆ జీడిపప్పు తొక్క ద్వారా ఆయిల్ సేకరించి ఆదాయం సమకూర్చుతున్నామని పేర్కొన్నారు.. పరిశ్రమలలో కాలుష్యానికి కారణమయ్యే బొగ్గు వాడకాన్ని కూడా తగ్గిస్తున్నామని తెలిపారు పవన్ కల్యాణ్.. అయితే, కొన్ని దశాబ్దాలుగా విశాఖ పరిశ్రమల అభివృద్ధితో కాలుష్యానికి దగ్గర అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.. ఒక ప్రత్యేక ప్రణాళిక ద్వారా, విశాఖను కాలుష్యానికి దూరంగా ఉంచేలా ప్రయత్నిస్తాం అన్నారు.. గత ప్రభుత్వం కాలుష్య నివారణకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.. అయితే, తమ ప్రభుత్వం గాలిలో నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.. కాలుష్యం ఏ అభివృద్ధికి అయినా ఆటంకం కలిగిస్తోంది.. కాలుష్యం లేని అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
మరణం కూడా విడదీయలేని బంధం.. గంటల వ్యవధిలో వృద్ధ దంపతుల మృతి
కొందరని మరణంకూడా విడదీయలేదు.. ఇప్పటికే ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి.. ఉన్నన్ని రోజులు కలిసి మెలిసి ఉండి.. ప్రమాదంలో ఒకేసారి ప్రమాణాలు విడిచినవారు కొందరైతే.. స్నేహితులు.. లేదా కట్టుకున్నవారు.. పిల్లలు.. ఇలా సన్నిహితులు ప్రాణాలు విడిచిన కొన్ని క్షణాల్లోనే.. ప్రాణాలు వదిలినవారు ఎంతో మంది ఉన్నారు.. ఇప్పుడు ప్రకాశం జిల్లాలో అలాంటి ఘటనే వెలుగు చూసింది.. మూడు ముళ్లు.. ఏడడుగుల బంధంతో ఆరవై సంవత్సరాల కిందట ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు. కష్టనష్టాల్లో కలిసి నడిచారు. చివరికి ఈ లోకాన్ని కూడా కొద్ది గంటల వ్యవధిలోనే నువ్వు లేక నేను లేను అన్నట్టుగా ఒకరి తర్వాత ఒకరు కన్నుమూశారు.. మర్రిపూడి మండలం చెంచిరెడ్డిపల్లె గ్రామంలో జరిగిన ఘటనకు సంబంధిచిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెంచిరెడ్డిపల్లెలో ఉస్తెలమూరి దిబ్బారెడ్డి (85), తిరుపాలమ్మ(75) దంపతులు నివాసం ఉండేవారు.. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.. తిరుపాలమ్మ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స అందిస్తున్నప్పటికీ ఆరోగ్యం మెరుగు పడలేదు. పరిస్థితి విషమించి ఆమె సోమవారం సాయంత్రం మృతి చెందింది. కుటుంబ సభ్యులు మంగళవారం అంత్యక్రియలు పూర్తిచేశారు. అయితే, శ్మశాన వాటిక నుంచి తిరిగొచ్చిన గంటలు వ్యవధిలోనే ఆమె భర్త దిబ్బారెడ్డి ఒక్క సారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. చెంచిరెడ్డిపల్లి గ్రామంలో కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలమూకున్నాయి.. వెంట వెంటనే తల్లిదండ్రులు మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదం నెలకొంది..
మందుబాబుల వల్లే ఓటమిపాలయ్యా..! మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని ముఠగట్టుకుంది.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘన విజయాన్ని అందుకుంది.. అయితే, ఇప్పటి వరకు ఆ ఓటమిపై రకరకాల విశ్లేషలు వచ్చాయి.. తాజాగా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. మందు తాగే తమ్ముళ్ల వల్లే గత ఎన్నికల్లో వైసీపీతో పాటు తాను ఓటమి పాలయ్యాని అని వ్యాఖ్యానించారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి. మా ప్రభుత్వంలో నాసిరకం మద్యం అమ్ముతున్నారని కూటమి నేతలు ఎన్నికల్లో చేసిన మాటలు నమ్మి మందు బాబులు కూటమికి ఓట్లు వేశారని పేర్కొన్నారు. అయితే, ఎన్నికల తర్వాత మందు బాబులను, మద్యం వ్యాపారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేశారంటూ.. కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. నాడు ప్రభుత్వం అమ్మిన మద్యమే నేడు ప్రైవేటు వ్యాపారులు అమ్ముతున్నారని విమర్శించారు.. నాడు విషం అని చెప్పిన మద్యం, నేడు అమృతంగా మారిందా? అని ప్రశ్నించారు. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పి, నేడు అదే తమ ప్రభుత్వ హయాంలోని మద్యాన్ని అమ్ముతున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నేడు మంచినీళ్లు లేకపోయినా మద్యం మాత్రం ఏరులై పారుతోందని అంటూ ఆరోపించారు.. మద్యం ధరలు తగ్గించకుండా ప్రజలను మోసం చేశారు.. అదే విధంగా మద్యం వ్యాపారులను కూడా మోసం చేశారు.. 20 శాతం మార్జిన్ ఇస్తామని హామీ ఇవ్వడంతో అధిక సంఖ్యలో వ్యాపారులు టెండర్లు దాఖలు చేశారు… మద్యం షాపుల లాటరీ ముగిసిన తర్వాత 9:30 శాతాన్ని మాత్రమే ఇస్తామని వ్యాపారులను మోసం చేశారని.. విచ్చలవిడిగా బెల్ట్ షాపులను ఓపెన్ చేయడం వల్ల మద్యం ఏరులై పారుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం..
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గాంధీ భవన్ లో నేడు ప్రజా వాణి కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు గాంధీ భవన్ లో దరఖాస్తులు పరిష్కరించనున్నారు. అనంతరం కాంగ్రెస్ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత ప్రభుత్వం.. లోపల బంధించుకుని పాలించే వాళ్ళు అన్నారు. ప్రజా పాలనలో మంత్రులు, ముఖ్యమంత్రులే ప్రజల దగ్గరకు వెళ్తున్నామన్నారు. విద్య, వైద్యం పైనా మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. 59 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గ్రూప్ 1 కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న వాళ్ల కోసం పరీక్షలు పెట్టామని క్లారిటీ ఇచ్చారు. తిరకాసు పెట్టీ పరీక్షలు పెట్టకుండా కుటిల ప్రయత్నాలు చేశారు బీఆర్ఎస్ నేతలు చేశారని మండిపడ్డారు. వాటిని ఎదుర్కొని పరీక్షలు పెట్టామని భట్టి విక్రమార్క తెలిపారు. ఆర్టీసీ బస్సుల కొనుగోలు కూడా మహిళా సంఘాలతో కొనిస్తామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామన్నారు. కుల గణన దేశానికి తెలంగాణ మోడల్ అన్నారు. కొద్ది మంది దోపిడీ దారులు అడ్డుకోవాలని తప్పుడు ప్రచారం చేశారు, చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమ్మ భాష నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోండి..
అమ్మ భాష నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. హైదరాబాద్ శిల్పారామంలో నాలుగు రోజుల పాటు అంతర్జాతీయ కళా ప్రదర్శనలో భాగంగా.. వెంకయ్య నాయుడు ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. రేపు లోక్ మంథన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. కాగా.. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. లోక్ మంథన్ కార్యక్రమంను భాగ్యనగర్ లో నిర్వహించడం చాలా సంతోషకరం అన్నారు. మళ్ళీ తిరిగి మన మూలాలకు వెళ్ళాలన్నారు. మన సాంస్కృతిక వారసత్వాలను కాపాడుకోవాలన్నారు. మన కళలు, సంస్కృతులు, వాయిద్యాలను రక్షించుకోవాలని తెలిపారు. మన సంస్కృతిని, మన భాషను, మన సంప్రదాయాలును మర్చిపోయామన్నారు. ప్రకృతిని ప్రేమించే పవిత్ర మైన జాతి, హిందూ ధర్మం మనదని తెలిపారు. ఇంగ్లీష్ వాడు ఆర్థికంగా దోచుకోవడమే కాదు మన మనస్సును కూడా దోచుకుని వెళ్ళిపోయాడన్నారు.
కాగ్ అధిపతిగా తెలుగు అధికారి ప్రమాణస్వీకారం
ప్రతిష్ఠాత్మక భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొండ్రు సంజయ్ మూర్తి చేపట్టారు. కాగ్ అధిపతిగా ఈరోజు (గురువారం) ప్రమాణ స్వీకారం చేపట్టారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించింది. ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్‌మూర్తి అరుదైన రికార్డ్ సృష్టించారు. అమలాపురం మాజీ ఎంపీ కేఎస్‌ఆర్ మూర్తి కుమారుడు సంజయ్.. 1964 డిసెంబర్ 24న జన్మించారు. 1989లో ఐఏఎస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు ఎన్నికై.. ఆ తర్వాత కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. 2021 సెప్టెంబర్ నుంచి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా విధులు నిర్వహించారు. ఇక, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానం అమలులో సంజయ్ మూర్తి కీలక పాత్ర పోషించారు. ఐఏఎస్ అధికారిగా వచ్చే నెలలో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. ఇక, కొండ్రు సంజయ్ సేవలను గుర్తించిన మోడీ సర్కార్ ఈ కీలక బాధ్యతలు కట్టబెట్టింది. ఈ స్థానంలో నియమితులైనవారు గరిష్ఠంగా ఆరేళ్లు లేదా.. 65 ఏళ్ల వయసు వరకు కొనసాగే అవకాశం ఉంది. సంజయ్‌మూర్తి తండ్రి కేఎస్‌ఆర్ మూర్తి 1996లో కాంగ్రెస్ తరఫున అమలాపురం నుంచి లోక్‌సభకు గెలిచారు. అంతకు ముందు ఆయన కూడా ఐఏఎస్ అధికారిగా కేంద్ర సర్కార్ లో కార్యదర్శి స్థాయిలో సేవలను అందించారు.
అమెరికాలో అదానీపై కేసు.. జేపీసీకి కాంగ్రెస్ డిమాండ్
గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడంతో కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయింది. ఆయన వ్యవహారాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దర్యాప్తునకు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చేసింది. లంచం, మోసం చేశారనే అభియోగాలపై అదానీతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఈ ఆరోపణలతో స్టాక్ మార్కెట్ సైతం భారీగా పడిపోయాయి. మరోపక్క, రాజకీయంగానూ ఈ వ్యవహారం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇక, గౌతమ్ అదానీపై యూఎస్ లో కేసు ఫైల్ కావడంతో కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా హమ్ అదానీ కె హై సిరీస్‌లో ఇప్పటి వరకు వందలాది ప్రశ్నలు సంధించాం.. కానీ, మోడీ- అదానీ బంధంపై వేసిన ప్రశ్నలకు ఇప్పటి వరకు ఆన్సర్ దొరకలేదని విమర్శించారు. మోదాని కుంభకోణంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏర్పాటు చేయాలని విపక్షాలు 2023 జనవరి నుంచి డిమాండ్ చేస్తున్నాయని జైరాం రమేష్ వెల్లడించారు.
ఇది విన్నారా?.. రూ.1021 కోట్లు పలికిన పెయింటింగ్!
బెల్జియం సర్రియలిస్ట్ ఆర్టిస్టు ‘రెన్ మార్గిట్’ వేసిన ఓ పెయింటింగ్ వేలంలో రికార్డు ధరను కొల్లగొట్టింది. మంగళవారం న్యూయార్క్‌లో జరిగిన క్రిస్టీస్ వేలంలో ఏకంగా 121 మిలియన్ డాలర్లు పలికి సంచలనం సృష్టించింది. భారత కరెన్సీలో ఈ ధర రూ.1021 కోట్లు. అధివాస్తవికతను చిత్రించే పెయింటింగ్‌లలో అత్యధిక ధర పలికిన రికార్డును ఇది సొంతం చేసుకుంది. ఈ రికార్డు ధర తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. అదే సమయంలో రెనె మాగ్రిట్‌ను ‘మాస్టర్ ఆఫ్ సర్రియలిజం’ అని ఊరికే పిలవరని అంటున్నారు. పగలు, రాత్రి అద్భుతంగా కనిపించేలా వేసిన ఈ కళాఖండానికి ‘ఎల్ ఎంపైర్ డెస్ లూమియర్స్’ లేదా ‘ద ఎంపైర్ ఆఫ్ లైట్’ అని అంటారు. 1954కు చెందిన ఈ పెయింటింగ్.. అధివాస్తవికతకు సంబంధించి అత్యుత్తమ వ్యక్తీకరణగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సర్రియలిస్ట్ రెన్ మార్గిట్ వేసిన 27 ప్రఖ్యాత పెయింటింగ్‌ల కలెక్షన్ ‘ద ఎంపైర్ ఆఫ్ లైట్’లో ఈ పెయింటింగ్‌ను మణిపూసగా చెబుతారు. వీధి దీపపు వెలుగుల్లో ఇల్లు.. ఇంటికి ముందూ, వెనక చెట్లు.. ఇంటిపైన నీలాకాశం, తెల్లని మబ్బులు.. నీటిలో వాటి ప్రతిబింబం చూసేందుకు సాదాసీదాగా ఉన్నా వాస్తవికతకు అద్దం పడుతోంది.
గౌతమ్ అదానీపై లంచం ఆరోపణలు.. కుప్పకూలిన కంపెనీ షేర్లు
అదానీ గ్రూప్ ఛైర్మన్, దేశంలోని రెండవ అత్యంత సంపన్న పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో లంచం, మోసం ఆరోపణల కారణంగా అదానీ గ్రూప్ లిస్టెడ్ స్టాక్స్ భారతీయ స్టాక్ మార్కెట్‌లో భారీగా పతనం అవుతున్నాయి. ఇప్పటి వరకు అదానీ గ్రూప్ షేర్లలో 20 శాతం వరకు క్షీణత కనిపిస్తోంది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు 20 శాతం క్షీణతతో ప్రారంభమయ్యాయి. స్టాక్ లోయర్ సర్క్యూట్‌ను తాకింది. గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 10 శాతం పడిపోయి రూ. 2539కి చేరాయి. ఈ షేర్ కూడా లోయర్ సర్క్యూట్‌ను తాకింది. అదానీ పోర్ట్స్‌లో 10 శాతం, అంబుజా సిమెంట్‌లో 10 శాతం, అదానీ పవర్‌లో 16 శాతం క్షీణత కూడా కనిపించింది. నవంబర్ 21, 2024 గురువారం స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే, అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనం అయ్యాయి. గ్రూప్‌లోని మొత్తం 10 లిస్టెడ్ కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు 20 శాతం క్షీణించి రూ.697.70కి పడిపోయాయి. స్టాక్ లోయర్ సర్క్యూట్‌ను తాకింది. అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 14 శాతం క్షీణించి రూ.577.80కి, అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు 18 శాతం క్షీణించి రూ.1159కి, ఏసీసీ షేర్లు లోయర్ సర్క్యూట్ తర్వాత రూ.1966.55కి పడిపోయాయి. అంబుజా సిమెంట్ కూడా 10 శాతం పడిపోయింది. స్టాక్ లోయర్ సర్క్యూట్‌లోకి ప్రవేశించింది. అదానీ పోర్ట్స్ & సెజ్ షేర్లు కూడా 10 శాతం తగ్గి రూ.1160 వద్ద ట్రేడవుతుండగా, అదానీ విల్మార్ షేర్లు 8 శాతం క్షీణించి రూ.301 వద్ద ట్రేడవుతున్నాయి. ఎన్డీటీవీ షేర్లు 9.94 శాతం క్షీణించి రూ.152.02కు చేరాయి. అదానీ పవర్ షేర్లు 15.34 శాతం తగ్గి రూ.443.70కి చేరాయి. 10 శాతం పడిపోయిన తర్వాత, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ 2539 రూపాయలకు పడిపోయింది. ఈ షేర్ కూడా లోయర్ సర్క్యూట్‌ను తాకింది.
అయ్య బాబోయ్.. బాదుడు ఆగడం లేదుగా! తెలుగు రాష్ట్రాల్లో నేటి గోల్డ్ రేట్లు ఇవే
అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన అనంతరం వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. రూ.82 వేల నుంచి రూ.75 వేలకు దిగొచ్చింది. హమ్మయ్య గోల్డ్ రేట్స్ తగ్గుతున్నాయని కొనుగోలుదారులు తెగ సంతోషపడ్డారు. ఆ సంతోషం మూడు రోజుల ముచ్చటే అయింది. పసిడి ధరలు మరలా షాక్ ఇస్తున్నాయి. వరుసగా నాలుగో రోజు గోల్డ్ రేట్లు పెరిగాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.300 పెరగగా.. 24 క్యారెట్లపై రూ.330 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (నవంబర్ 21) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,450గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.77,950గా ఉంది. మరోవైపు వరుసగా రెండు రోజులు పెరిగిన వెండి ధర.. నేడు స్థిరంగా ఉంది. నేడు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.92,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి లక్ష ఒక వెయ్యిగా ఉంది. అత్యల్పంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో 92 వేలుగా నమోదైంది.
‘పుష్ప-2’ ట్రైలర్‌పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కామెంట్స్ వైరల్!
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తూ ప్రేక్షకులు ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప 2. పుష్ప 1కు సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం రావడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా నవీన్ నూలి ఎడిటర్ గా ఈ చిత్రానికి పనిచేయడం మరింత విశేషం. సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేసారు మేకర్స్. కాగా పుష్ప ట్రైలర్ పై అటు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు అద్భుతమని కొనియాడుతున్నారు. అల్లూ అర్జున్ అదరగొట్టాడు అని కితాబు నిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ కు చెందిన నంద్యాల మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత శిల్ప రవి చేసిన కామెంట్ ఇప్పడు టాక్ అఫ్ ది టౌన్. పుష్ప ట్రైలర్ పై లాట్స్ అఫ్ లవ్.. పుష్ప వైల్డ్ ఫైర్ వెండితెరపై చూసేందుకు ఈగర్ గా ఎదురుచూస్తున్నాను అని ట్వీట్ చేస్తూ పుష్ప ప్రమోషన్స్ కు చెందిన కొన్ని వస్తువులను ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసారు,. అందుకు బదులుగా అల్లు అర్జున్ స్పందిస్తూ ని ప్రేమకు థాంక్యూ బ్రదర్ అంటూ రిప్లై ఇచ్చారు. 2024 ఎన్నికల్లో శిల్ప రవి కోసం నంద్యాల వెళ్లడంతో అల్లు vs మెగా ఫ్యాన్స్ గా విడిపోయిన సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
రష్మిక తో లవ్ కన్ఫామ్ చేసినట్టేనా..?
టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ, రష్మిక వ్యవహారం గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించారు. అయితే డియర్ కామ్రేడ్ లో కేవలం విజయ్ కోసమే ముద్దు సీన్ లో నడిచిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇటీవల రష్మిక హైదరాబాద్ వస్తే విజయ్ దేవర కొండ ఇంట్లోనే ఉంటుంది. ఏదైన పండుగ వస్తే రౌడీ బాయ్ ఫామిలీ తో కలిసి సెలెబ్రేట్ చేస్తోంది దాంతో వెరీ ప్రేమ వ్యవహారంపై వస్తున్న వార్తలకు ఊతం ఇచ్చినట్టైంది. ఇక తాజాగా విజయ్ దేవరకొండ సాహిబా అనే మ్యూజిక్ ఆల్బమ్ లో నటించాడు. ఆ ఆల్బమ్ రిలీజ్ అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రేమ గురించి విజయ్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారాయి. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..” ప్రేమ అనేది అందరికి తప్పక పుడుతుంది. అబ్బాయిలు మీరు ఇంకా యంగ్ గానే ఉన్నారు. కాబట్టి ఇంకాస్త సమయం ఇవ్వండి. బాయ్స్ అన్నిటికంటే ముందు జీవితంలోనే కాదు మీరు ఆలోచన విధానంలో కూడా ఎదగడం నేర్చుకోండి. అదేం తప్పు కాదు కదా. ముఖ్యంగా 30 ఇయర్స్ దాటిన బాయ్స్ , 20 ఏళ్ల వయసు ఉన్న వారి కంటే కూడా బెటర్ గా థింక్ చేస్తారు. ఆ వయసు ఉన్నప్పుడు ఆలోచనలు ఏవి స్థిరంగా ఉండవు. ఏది కూడా డిసైడ్ అవలేము. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అందుకే టైమ్ కోసం ఎదురుచూడండి. దేనిని కూడా ఫోర్స్ చేయకండి” అని అన్నారు. ఈ కామెంట్స్ రష్మిక తో లవ్ అనుభవం వల్లే వచ్చాయని, ఆమెతో లవ్ కన్ఫామ్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..