జనగామ జిల్లాలో ఓ వివాహిత అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. తాను చనిపోతున్నట్లు లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండలం రాయిపల్లి గ్రామానికి చెందిన శృతి(22) అనే వివాహిత భర్త వేధింపులతో తాళలేక పోయింది. మానసిక వేదనకు గురైన శృతి దేవరుప్పుల మండలం కడవెండి గ్రామంలోని తన తల్లి గారి ఇంటికి ఈ నెల 3న వచ్చింది. ఈ నెల 6 న తెల్లవారుజామున 3 గంటలకు తన 20 నెలల…
ఇటీవలి కాలంలో చిన్న చిన్న విషయాలకే మానసిక వేధనకు గురై షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే తరహాలో ఓ వివాహిత ఇంట్లో చోరీకి గురైన బంగారు ఆభరణాలు దొరకలేదని తీవ్ర మనస్థాపానికి గురైంది. కొడుకుతో సహా భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈఘటన వనస్థలిపురంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చింతల్‌కుంటకు చెందిన సుధేష్ణకు(28) నాలుగేళ్ల కిందట అమ్మదయ కాలనీకి చెందిన నోముల ఆశీష్ కుమార్‌తో వివాహం జరిగింది. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు ఆరుష్‌కుమార్ ఉన్నాడు.…
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఉద్రిక్తత నెలకొంది.. మొన్న ఏ కొండూరు గ్రామానికి చెందిన వెంపాటి మధుమిత (22) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.. విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామంలో అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని ప్రాణాలు వదిలారు.. మృతురాలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ ఉండేది.. మృతురాలు మధుమిత అమ్మమ్మ గారి ఊరు తెల్లదేవరపల్లి గ్రామం కాగా.. విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామానికి చెందిన బోల్లిపోగు ప్రతాప్ అనే వ్యక్తి తమ కూతురిని తీసుకెళ్లి చంపి ఉరి వేసినాడు…
Crime: విశాఖపట్నంలో సంచలనం రేపిన వివాహిత హత్య కేసును భీమిలి పోలీసులు ఛేదించారు. మహిళతో సన్నిహితంగా ఉన్నవాడే హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. దీంతో అనుమానితుడు క్రాంతి కుమార్ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నారు.
జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కొడిమ్యాల మండల కేంద్రంలో ఆవుదుర్తి మమత(32) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాలిన స్థితిలో ఇంట్లో ఉన్న దూలానికి మృతదేహాం వేలాడుతోంది. ఇంటి చుట్టూ తాళాలు వేసి ఉన్నాయి. దుర్గంధం వెదజల్లడంతో పోలీసులకు సమాచారం అందించారు కాలనీవాసులు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని డోర్ ఓపెన్ చేశారు. 5 రోజుల క్రితం ఈ ఘటన జరిగి ఉండొచ్చని అనుమానం…
సోషల్ మీడియా.. కలుపుతుంది.. విడగొడుతుంది .. మంచి చేస్తుంది ..చెడు చేస్తుంది.. ఈ సోషల్ మీడియానే ఇప్పుడు చాలామందికి శత్రువులుగా మారిపోయింది ..ఈ సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకొని అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్లు కూడా లేకపోలేదు.. సోషల్ మీడియా కాపురాలను కూల్చివేస్తుంది. పచ్చని సంసారంలో కూడా సోషల్ మీడియా చిచ్చు పెడుతుంది. సోషల్ మీడియాలో వచ్చిన ఒక యాప్ ద్వారా ఇద్దరు పరిచయం అయ్యారు.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే తరహాలో ఇద్దరు కలిసి…
ఆమె అనాధ.. తల్లిదండ్రులు చనిపోయారు.. ముగ్గురు అక్క చెల్లెలు.. వీళ్లు ముగ్గురు కలిసి జీవిస్తున్నారు.. ఇందులో ఒక్కరికి వివాహమైంది. అక్క చెల్లెలు అందరు కూడా సంతోషించారు.. కానీ ఆ సంతోషం ఎంతో కాలం లేదు.. అక్క భర్త చేసే వేధింపులకు ఆత్మహత్య చేసుకుంది.. అక్క చెల్లెల్ని వదిలి మళ్లీ మరొకసారి అనాధల్ని చేసింది.. బావ వేధింపుల వల్లే అక్క చనిపోయిందంటూ చెల్లెలు అందరు కలిసి ఫిర్యాదు చేశారు. గుండెపోటుతో మరణించింది అని చెప్తున్నప్పటికీ ఒంటిపై గాయాలు ఉండడంతో…
కొందరి స్త్రీ, పురుషుల ప్రవర్తన కుటుంబ వ్యవస్థకు భంగం కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు పెళ్లికాని యువతీ, యువకులు ప్రేమించి పెళ్లి చేసుకునే వారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆల్రెడీ పెళ్లైన వారు వారిని విడిచి పెట్టి కొత్త సంబంధాలను ఏర్పర్చుకుంటున్నారు. పరాయి వ్యక్తుల మోజులో పడి భర్త, భార్యను వదిలేయడం, భార్య భర్తను వదిలి వెళ్లడం వంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. తాజాగ హైదరాబాద్ లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. 35 ఏళ్ల వయసున్న ఓ వివాహిత…
MP High Court: ఒక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకున్న వివాహిత మహిళ దాఖలు చేసిన అత్యాచారం కేసుని మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. పెళ్లి చేసుకుంటాననే హామీపై వివాహిత స్త్రీ మరొక పురుషుడితో శారీరక సంబంధానికి సమ్మతించానని చెప్పుకోవడానికి వీలులేదని జస్టిస్ మణీందర్ ఎస్ భట్టీ తన తీర్పులో వెల్లడించారు. తప్పుడు వివాహ హమీ సాకుతో శారీరక సంబంధానికి అంగీకరించానని వివాహిత స్త్రీ చెప్పడం సరైనది కాదని హైకోర్టు పేర్కొంది.