ప్రేమ రెండు దేశాల మధ్య బంధాన్ని ఏర్పర్చింది. దేశాల మధ్య ఏంటీ అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే.. భారత్, ఫ్రాన్స్ కు చెందిన ఇద్దరి ప్రేమికులతో ఈ రెండు దేశాల మధ్య ప్రేమ బంధం ఏర్పడింది. భారత్ లోని తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తిమ్మాపూర్ గ్రామానికి చెందిన యువకుడు, ఫ్రాన్స్ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇంకేముంది.. పెద్దలను ఒప్పించి హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. ప్రేమకు సరిహద్దులు అడ్డురావని నిరూపించారు.…
ఆదిలాబాద్ జిల్లాలో వింత దొంగతనం చోటుచేసుకుంది. గుట్టు చప్పుడు కాకుండా దొంగతనాలకు పాల్పడుతుంటారు దుండగులు. కానీ ఓ యువ దొంగ మాత్రం యజమాని కళ్ల ముందే చోరీకి పాల్పడ్డాడు. ఇంటి ముందు ఉన్న వ్యక్తిని, బైక్ ను తీసుకెళ్లాడు ఓ యువకుడు. తర్వాత మద్యం తాగాక పట్టణంలోని పలు కాలనీలు అదే బైక్ పై తిప్పాడు. ఆ తర్వాత ఓ చోట బాధితుడిని దింపేసి బైక్ తో పరార్ అయ్యాడు యువదొంగ. మద్యం మత్తులోంచి తేరుకున్న బాధితుడు…
ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తాడ్వాయి మండలం బిరెల్లిలో దహన సంస్కారానికి వెళ్లి చెరువులో దిగి మంకిడి పవన్ అనే యువకుడు గల్లంతయ్యాడు. గ్రామంలో రామకృష్ణ అనే వ్యక్తి చనిపోగా అతని అంతిమయాత్రలో పాల్గొని దహన సంస్కారం అనంతరం స్నేహితులతో కలిసి పవన్ అనే యువకుడు చెరువులోకి దిగాడు. అయితే నవీన్, వినయ్, రణధీర్, అనే నలుగురు స్నేహితులు అవతల ఒడ్డుకు చేరుకున్నరు. కానీ, పవన్ మాత్రం నీటిలో మునిగి గల్లంతయ్యాడు. వెంటనే వారు పోలీసులకు సమాచారం…
ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు సూసైడ్ చేసుకున్నాడు.. విశాఖపట్నంలో పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.. పెందుర్తి సుజాతానగర్ లో నివాసం ఉంటున్న మృతుడు సాయి మారుతి తండ్రి చంద్రశేఖర్ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతూ ఉంటాడు.. అతని కుమారుడు సాయి మారుతి కెవిన్ కొంతకాలం హైదరాబాద్ లో సినిమా పరిశ్రమలో పనిచేసి, ఇటీవలే ఇంటికి వచ్చాడు.
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలపాతాలు సైతం ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. జలసవ్వడులు వింటూ సేదతీరేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. అయితే అజాగ్రత్త కారణంగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలంలోని కొంగాల జలపాతం వద్ద విషాదం చోటుచేసుకుంది. జలపాతంలో పడి యువకుడు గల్లంతయ్యాడు. సెల్ఫీ తీసుకోడానికి జలపాతం దగ్గర కి వెళ్లి జారీ పడి యువకుడు మృతి చెందాడు. Also Read:Venkatesh : వెంకీ–త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్..…
లోన్ యాప్స్ లో అప్పులు చేసి వాటిని తీర్చేందుకు కొందరు పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. కొందరు తమకు తామే కిడ్నాప్ ప్లాన్ చేసుకుని కుటుంబ సభ్యుల నుంచే డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. మరికొందరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా బంజారాహిల్స్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఏకంగా స్నేహితుడి ఇంట్లోనే చోరికి తెగబడ్డాడు. బంజారాహిల్స్ లో ఆడవేషంలో వచ్చి బంగారం డబ్బును దోచుకెళ్లాడు హర్షిత్. లోన్ యాప్ ల ద్వారా అప్పులు చేసి, అప్పులు తీర్చాలని…
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో సైబర్ మోసం వెలుగుచూసింది. సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలతో బురిడీ కొట్టిస్తున్నారు. కొన్ని రోజుల నుంచి జెమినీ ఏఐ ఫోటో ఎడిట్ యాప్ ద్వారా ఫొటోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసుకుని సంబరపడిపోతున్నారు. 3డీ ప్రింట్, నానో బనాన ఇలా రకరకాలుగా ఫోటోలను ఎడిట్ చేస్తుంది జెమినీ ఏఐ. అయితే జెమినీ ఏఐ ట్రెండింగ్ ఫోటో ఎడిట్ యాప్తో యువకుడికి రూ.70 వేల నష్టం వాటిల్లింది. ట్రెండింగ్లో ఉన్న…
ఓ యువకుడు ప్రేమ పేరుతో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ లో చోటుచేసుకుంది. నేపాల్ కి చెందిన బాలిక జూబ్లీహిల్స్ లో తల్లితండ్రితో కలిసి నివాసం ఉంటోంది. బాలిక కి తన ఇంటి సమీపంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు కృష్ణ తో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో బాలిక ను ట్రాప్ చేశాడు కృష్ణ.. లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని చెప్పడంతో ఇంట్లో నుంచి బాలిక వచ్చేసింది. Also Read:Gold Price Today:…
వరంగల్ నగరంలో కిడ్నాప్ డ్రామా కలకలం రేపింది. ఆన్‌లైన్ బెట్టింగుల్లో డబ్బులు పెట్టి, అప్పులు చేసి, చివరికి కుటుంబ సభ్యులను మోసం చేసే దిశగా ఓ యువకుడు ప్లాన్ చేశాడు. కానీ చివరకు తన ప్లాన్ అట్లర్ ప్లాప్ అయ్యింది. వరంగల్ కొత్తవాడ ప్రాంతానికి చెందిన ఆదిల్ సోనీ అనే యువకుడు ఆన్‌లైన్ బెట్టింగుల్లో సుమారు 8 లక్షల అప్పు చేశాడు. అప్పులు ఇచ్చినవారు తిరిగి అడుగుతుండడంతో తనకు తానే కిడ్నాప్ స్కెచ్ వేసుకున్నాడు ఆదిల్ సోనీ..…
సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు యువకుడిని హత్య చేసి ఇంటి ముందు పడేశారు. జయప్రకాష్ (22) అనే యువకుడిని హత్య చేసి శవాన్ని ఇంటి ముందు పడేశారు. మృతుడు మేస్త్రి వర్క్ చేస్తూ జీవిస్తున్నట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోల్ చెందిన వ్యక్తిగా గుర్తింపు. బొల్లారం మున్సిపల్ కెబిఆర్ కాలనిలో నివసిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. యువకుడి…