Harassing On Horse: పెళ్లి ఊరేగింపులో కొందరు యువకులు గుర్రంపై దారుణంగా ప్రవర్తించిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఊరేగింపులో గుర్రాన్ని బలవంతంగా నేలపై పడుకోబెట్టి సిగరెట్ తాగించడం, దానిపై పుష్-అప్స్ చేస్తూ వికృత చేష్టలకు పాల్పడడం వంటి చర్యలు ప్రజల ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ‘ఇట్స్ జీన్వాల్ షాబ్’ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేసిన వీడియోలో, ఒక వ్యక్తి బూట్లతో గుర్రంపై ఎక్కి దాని శరీరంపై పుష్-అప్స్ చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. పెళ్లి వేడుకలో పాల్గొన్న కొందరు యువకులు గుర్రాన్ని లాగుతూ.. దానిపై పుష్-అప్స్ చేయమని ఒకరినొకరు ప్రోత్సహించారు. నిస్సహాయంగా నేలపై పడి ఉన్న ఆ మూగజీవిని పెళ్లి అతిథుల క్రూరమైన చర్యలకు బలి చేశారు. కాకపోతే.. ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయం మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Read Also: SLBC: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ మధ్యలో ద్వారం ఏర్పాటుకు కసరత్తులు..
ఈ వీడియోలో గుర్రం నోటిలో వెలిగించిన సిగరెట్‌ను బలవంతంగా పెట్టినట్లు కనిపిస్తోంది. ఆ జంతువు నేలపై పడుకుని సిగరెట్ తాగేలా చేశారు. పెళ్లికి వచ్చిన అతిథులు ఎవరూ ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించక పోవడం ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది. అక్కడి వారంతా డ్యాన్స్ చేస్తూ ఆ గుర్రాన్ని హింసిస్తూ ఆనందించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ.. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్లిప్‌ను అనేక మంది జంతు ప్రేమికులు షేర్ చేస్తూ, గుర్రం శరీరంపై పుష్-అప్స్ చేయడం, సిగరెట్ తాగించడం వంటి చర్యలను ప్రశ్నిస్తున్నారు. అయితే, జంతు ప్రేమికులు గుర్రానికి న్యాయం చేయాలని, దోషులను శిక్షించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
Read Also: CM Chandrababu and Deputy CM Pawan Kalyan: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కీలక చర్చలు..
ఈ వీడియోపై కొంతమంది నటీమణులు కూడా కామెంట్స్ చేసారు. ఈ బాధాకరమైన సంఘటనపై స్పందిస్తూ.. “నా రక్తం మరిగిపోతోంది. నా చేతుల్లో అధికారం ఉంటే బాగుండేది” అని కామెంట్ చేసారు. ఈ ఘటన జరగడం చాలా బాధగా ఉందని మరో నటి కామెంట్ చేసారు. మొత్తానికి ఈ సంఘటన జంతువుల పట్ల మానవత్వం లేని ప్రవర్తనను వెల్లడిస్తుంది. మూగజీవాలపై ఇలాంటి క్రూరమైన చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.