కాజీపేట అయోద్యపురం వద్ద రైల్వే వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ కు ఈనెల 8వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంఖుస్థాపన చేయనున్నారు. వర్క్ షాప్ శంఖుస్థాపన ఏర్పాట్లను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అద్యక్షులు బండి సంజయ్ పరిశీలించారు. అనంతరం హన్మకొండ హరిత కాకతీయలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
Read Also: Srikanth Addala: పెన్ను వదిలి కత్తి పట్టిన శ్రీకాంత్ అడ్డాల
ఈ నెల 8వ తారీఖున ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వరంగల్ పర్యటనకు వస్తున్నాడని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. అనేక అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ఉంటుంది అని ఆయన వెల్లడించారు. అదే రోజు బీజేపీ పార్టీ బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు. మోడీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి అని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చాడు.
Read Also: Disha Patani: రెడ్ శారీలో దిశ అందాల విందు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటిసారి ఓరుగల్లు కు వస్తున్నారు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వారికి స్వాగతం పలికేందుకు వరంగల్ ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నాడు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపన కోసం వరంగల్ వస్తున్నారు.. జాతీయ రహదారుల అభివృద్ధితో పాటు మౌలిక వసతుల కల్పనకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. దేశంలోనే మొదటి సిమెంట్ రోడ్డు నిర్మాణం చేసిన వరంగల్ రోడ్డే.. వెయ్యి స్తంభాల గుడి మండపం శిథిలావస్థకు చేరిన వెయ్యి కళ్యాణ మండపం పూర్తి స్థాయిలో రిపేర్ చేస్తున్నాం.. హైదరాబాద్ చుట్టూ ఉన్న 10 జిల్లాలను కలుపుకుని RRR రింగ్ రోడ్డు నిర్మాణం కోసం
దీని కోసం భూ సేకరణ కోసం 500 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది అని ఆయన వెల్లడించారు.
Read Also: CPI Ramakrishna: దేశ ప్రజల మధ్య విభజన రేఖ గీయడానికి.. యూసీసీ తీసుకొస్తున్నారు
యాదాద్రి వరకు MMTS రైలును విస్తరించేందుకు రూ. 330 కోట్లతో విస్తరించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం వాట ఇవ్వకపోవడంతో ఎంఎంటీఎస్ విస్తరణ ఆలస్యం అయ్యింది అని కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వాట ఇవ్వకున్న పెద్ద మనసుతో కేంద్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో నిధులు వెచ్చింది నిర్మాణం చేసేందుకు నిర్ణయించింది. కోచ్ ఫ్యాక్టరీ స్థానంలో రైల్వే ఓవరాలింగ్ యూనిట్ తో పాటు వ్యాగన్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నాం.. వ్యాగన్ తయారీ పరిశ్రమ లో రోజుకు 200 వ్యాగన్లు తయారు చేసే సామర్ధ్యం ఈ పరిశ్రమకు ఉంటుందన్నాడు.