CPI Ramakrishna Comments On Uniform Civil Code: మరోసారి దేశ ప్రజల మధ్య విభజన రేఖ గీసేందుకు ‘యూనిఫామ్ సివిల్ కోడ్’ తీసుకురావాలని చూస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో యూసీసీనే ప్రధాన అజెండా అని తెలిపారు. మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే.. భారతదేశాన్ని పూర్తిగా హిందూ దేశంగా చేస్తారని అభిప్రాయపడ్డారు. కర్ణాటక ఎన్నికల్లో కూడా మతాన్ని ఎన్నికల అస్త్రంగా చేసుకొని ముందుకెళ్లారని గుర్తు చేశారు. చేసిందేమీ లేక, చెప్పుకోవడానికి ఏమీ లేక.. మత రాజకీయాలను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగ, రైతుల సమస్యలు అలానే ఉన్నాయని.. రైతులు ఎక్కడా సంతోషంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి పౌర స్మృతితో మరోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోందని చెప్పారు. జాతీయ స్థాయిలో దీనిపై చర్చించి, దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేపడతామని అన్నారు.
Kakani Govardhan Reddy: లోకేష్ పాదయాత్ర ఒక సర్కస్ కంపెనీ.. మీడియా కోసమే వివాదాస్పద వ్యాఖ్యలు
ఇక ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచులను గృహ నిర్బంధం చేస్తున్నారని రామకృష్ణ ఆరోపణలు చేశారు. పంచాయితీల డబ్బులు ఇవ్వకుండా ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని పేర్కొన్నారు. సర్పంచులు అభివృద్ధి పనులు చేయాలంటే.. వారికి నిధులివ్వడం లేదన్నారు. వైసీపీ నాయకుడే సర్పంచ్ సంఘానికి నాయకుడు అని.. సమస్యలు చెప్పుకోవడానికి ఆయనకే అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు వచ్చిన అధికారాలను నిర్బంధిస్తున్నారని.. ఇది రాజ్యాంగ వ్యతిరేకమని మండిపడ్డారు. ఛలో పంచాయితీ కార్యక్రమానికి సీపీఐ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. అమ్మఒడికి డబ్బులు వేశామని చెప్తున్నారని.. కానీ నేటికీ డబ్బులు జమ కాలేదని వ్యాఖ్యానించారు. డబ్బులు పడనప్పుడు బటన్ నొక్కడమెందుకు? ఆర్భాటానికా? అని ప్రశ్నించారు.
Say No: ‘నో’ చెప్పడం నేర్చుకో! ఆటంకాలు తొలగిపోతాయి… లక్ష్యాలు నెరవేరుతాయి
స్మార్ట్ మీటర్ల పేరుతో రాష్ట్ర ప్రజలపై మరో భారం వేస్తున్నారని రామకృష్ణ విరుచుకుపడ్డారు. కమిషన్ కోసం కక్కుర్తి పడి, అత్యధిక ధరకు అదాని కంపెనీకి స్మార్ట్ మీటర్ కాంట్రాక్ట్ అప్పగిస్తున్నారని ఆరోపించారు. స్మార్ట్ మీటర్ కావాలని ఎవరైనా ఆడిగారా? అని నిలదీశారు. ప్రజలపై వేల కోట్ల భారం వేయడానికి స్మార్ట్ మీటర్లు తీసుకొస్తున్నారన్నారు. 4వ తేదీ దేశంపై వామపక్ష పార్టీల సమావేశం నిర్వహించి.. భవిష్యత్ కార్యాచరణ చేపడతామని వివరించారు.