Srikanth Addala: పెన్ను వదిలి కత్తి పట్టిన శ్రీకాంత్ అడ్డాల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కొత్త బంగారు లోకం’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న శ్రీకాంత్ అడ్డాల… నారప్ప సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు అనగానే అందరూ ఫ్యామిలీ సినిమాల దర్శకుడు యాక్షన్ మూవీని ఎలా హ్యాండిల్ చేస్తారు అనుకున్నారు కానీ శ్రీకాంత్ అడ్డాలా ఆడియన్స్ ని, తాను యాక్షన్ సినిమా చెయ్యగలని నమ్మించడంలో సక్సస్ అయ్యాడు. ఇక ఇప్పుడు విరాట్ కర్ణ అనే కొత్త హీరోని ఇండస్ట్రీకి పరిచయం చేస్తు శ్రీకాంత్ అడ్డాల ‘పెద కాపు’ అనే సినిమా చేస్తున్నాడు. ‘ఓ సామాన్యుడి సంతకం’ అనే ట్యాగ్ లైన్ తో అనౌన్స్ అయిన ఈ మూవీ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో, రెండు వర్గాల మధ్య నలుగుతున్న జనం మధ్య నుంచి పుట్టి, వారి కోసం పోరాడిన ఒకడి కథతో ఈ సినిమా తెరకెక్కినట్లు అనిపిస్తోంది. టీజర్ లో చోటా కె నాయుడు పనితనం, శ్రీకాంత్ అడ్డాల మేకింగ్ సూపర్బ్ గా అనిపించాయి. శ్రీకాంత్ అడ్డాలలో ఇంత వయొలెన్స్ ఉందా అనిపించకమానదు.
ఈ రేంజ్ సినిమాలు కెరీర్ స్టార్టింగ్ లోనే చేసి ఉంటే శ్రీకాంత్ అడ్డాల ఈ పాటికి స్టార్ డైరెక్టర్ అయిపోయే వాడు. మేకింగ్ లో శ్రీకాంత్ అడ్డాల ఎంత చేంజోవర్ చూపించాడో, మ్యూజిక్ లో మిక్కీ జె మేయర్ కూడా అంతే కొత్తగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. పెదకాపు 1 టీజర్ బీజీఎమ్ వింటే, ఈ స్కోర్ ఇచ్చింది మిక్కీ జె మేయర్ యేనా అని ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. హీరోగా పరిచయం అవుతున్న విరాట్ కర్ణ కూడా స్క్రీన్ పైన ప్రామిసింగ్ గా కనిపించాడు. అతన్ని చూస్తూనే ముకుందా సినిమాలో వరుణ్ తేజ్ ని చూస్తున్నట్లు అనిపించింది. పెదకాపు 1 సినిమా కూడా ముకుంద సినిమాకి ఇంకో వెర్షన్ లా ఉండే అవకాశం కూడా ఉంది. మొత్తానికి శ్రీకాంత్ అడ్డాల పెన్ పక్కన పెట్టి కత్తి పట్టి సెన్సేషన్ క్రియేట్ చెయ్యడానికి రాబోతున్నాడు. అన్నట్లు పెదకాపు 1 టీజర్ ఎండ్ లో శ్రీకాంత్ అడ్డాల కనిపించాడు, ఏదైనా క్యారెక్టర్ చేస్తున్నట్లు ఉన్నాడు. మరి ఈ మూవీతో శ్రీకాంత్ అడ్డాల హిట్ కొడతాడో లేదో చూడాలి.
Also Read
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
- Movies Without Trailers: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఇవే.. లిస్ట్‌లో నాని కొత్త సినిమా!
ఓ సామాన్యుడి సంతకం ✍️💪
A Torch Bearer for the ‘COMMON MAN ✍️' #PK1Teaser 💥#PeddhaKapu1 Teaser Out Now!
A @SrikanthAddala_ Film 🔥@ViratKarrna @MickeyJMeyer @NaiduChota #MarthandKVenkatesh @mravinderreddyy @dwarakacreation pic.twitter.com/u0jLMtDe4X
— Dwaraka Creations (@dwarakacreation) July 2, 2023
తాజావార్తలు
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
-
Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!