వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లోని ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన జిల్లా ఈ వరంగల్ జిల్లా అని అన్నారు. భద్రకాళి మాత ఆశీర్వాదంతో మనం తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. ఎలక్షన్స్ వస్తే పార్టీకి ఒక్కరు వస్తారని విమర్శించారు. తప్పకుండ మీరు అభ్యర్థుల గురించి మీరు ఆలోచించాలని పేర్కొన్నారు. ఎలక్షన్స్ ఐపోగానే దుకాణం మొదలవుతుంది.. పార్టీల చరిత్రల ఆధారంగా ఓటు వేయాలన్నారు. అప్పుడే అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తెలంగాణ పార్టీ పుట్టిందే తెలంగాణ కోసమని అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం వస్తే ఇందిరామ్మ రాజ్యం వస్తది అంటున్నారు.. ఎందుకు ఆ ఇందిరమ్మ రాజ్యం వస్తే ఎమర్జెన్సీ రోజులే, చీకటి రోజులే అని ఆరోపించారు.
Andela Sriramulu: అసదుద్దీన్ ఒవైసీ, సబితా ఇంద్రారెడ్డిపై అందెల ఫైర్
కాంగ్రెస్ పార్టీ రూ.200 పింఛన్ మొక్కుబడిగా ఇచ్చి మిమ్ముల్ని బ్రతుకుపోమన్నారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ ఎన్నిక తరువాత రూ.5000 పింఛన్ ఇస్తానని సభాముఖంగా చెప్పారు. తలసారి ఆదాయంలో భారత్ దేశంలోనే మొదటి స్థానంలో మనం ఉన్నామన్నారు. గవర్నమెంట్ భూములలో గుడిసెలు వేసుకున్న ప్రతి ఒక్కరికి పట్టాలు ఇస్తామని అన్నారు. తెలంగాణను అన్ని రకాలుగా ఏడిపించినది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. అజం ఝాహి మిల్లును ముంచింది కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు. రాబోయే కొద్దిరోజులలో ఇక్కడ లక్ష ఉద్యోగాలు వస్తాయి.. విద్యలో వైద్యలో ముందుకు వెళ్తున్నాం.. హెల్త్ యూనివర్సిటీ కాళోజి పేరు పెట్టి ఇక్కడే పెట్టబోతున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.
Bandi Ramesh: వారికి ఇప్పటివరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు..
రైల్వే మీద కనీసం 6 బ్రిడ్జిలు నిర్మాణాలు చేయిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ తయారు చేసాము.. వరంగల్ లో 24 అంతస్థుల బిల్డింగ్ ఆకాశాన్నే ముద్దు పెట్టుకునేంత ఉంది.. ఈ ఒక్క బిల్డింగ్ చాలాదా ఇద్దరు ఎమ్మెల్యేను గెలిపించడానికి అని తెలిపారు. వందల, వేల మందికి ఈ హాస్పిటల్ ఉపయోగపడుతుంది కేసీఆర్ పేర్కొన్నారు. ఆటో రిక్షాల వెనుక దాస్యం మా ధైర్యం.. అని పెట్టుకున్నారు గొప్ప విషయం అని అన్నారు. ఆటో వాళ్ళకి చెపుతున్న సంవత్సరానికి ఒకసారి ఉండే ఫిట్నెనెస్ కి సంబంధించినది కూడా ఈ ఎన్నికల తరువాత ఎత్తివేస్తామని తెలిపారు. వరంగల్ పెద్ద చరిత్ర కలిగిన జిల్లా.. ఐటీ పరిశ్రమలు వస్తాయ్, అనేక పరిశ్రమలు వస్తాయన్నారు. మీ ఆశీర్వాదం తెలంగాణ మీద ఉండాలి అని కోరుకుంటున్నట్లు కేసీఆర్ పేర్కొన్నారు.