ABV ఫౌండేషన్ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకోపన్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ ఎంపి సభ్యులు సుధాన్ష్ త్రివేది హాజరయ్యారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. వాజ్ పేయి స్ఫూర్తితో ఈ దేశ యువత ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తెలిపారు.
Ponnam Prabhakar: సమగ్ర కుల సర్వేలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు ఇంతవరకు పాల్గొనలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
CM Revanth Reddy: నేడు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నిరుద్యోగ విజయోత్సవ భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రశంగించనున్నారు.
నెల్లూరులో జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు జిల్లా అభివృద్ధిలో భాగ స్వాములు కావాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి.. నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు.
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో వున్న విషయం తెలిసిందే.. మంగళవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన హస్తిన పర్యటనకు బయలుదేరారు.
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా బోకారోలో ముఖ్య కార్యకర్తల సమన్వయ సమావేశానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హాజరయ్యారు. సమావేశానికి ముందుగా ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళి అర్పించి.. అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలను కార్యకర్తలకు దిశానిర్ధేశం చేసారు.
కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్త పల్లి సెంటర్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిఠాపురం ప్రజలు తనకు చాలా బాధ్యతలు ఇచ్చారన్నారు. ఏలేరు సుద్దగడ్డ ఆధునికీకరణ చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. పిఠాపురంని టెంపుల్ టూరిజంగా డెవలప్ చేస్తామని తెలిపారు. పిఠాపురం ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనన్నారు. 18 నెలల్లో తీరం కోత సమస్యను పరిష్కరిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఉప్పాడ…
కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి సెంటర్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం తర్వాత తొలి బహిరంగ సభలో పాల్గొన్నారాయన. డిప్యూటీ సీఎంగా వారాహి మీద నుంచి తొలి ప్రసంగం చేశారు. తనను గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్. అంతేకాకుండా.. ఇదే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.
ఈ ఏడాది యోగా దినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం దాల్ సరస్సు సమీపంలో ఉన్న షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయుష్ శాఖ మంత్రి ప్రతాపరావు జాదవ్ మంగళవారం వెల్లడించారు.