వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లోని ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన జిల్లా ఈ వరంగల్ జిల్లా అని అన్నారు. భద్రకాళి మాత ఆశీర్వాదంతో మనం తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. ఎలక్షన్స్ వస్తే పార్టీకి ఒక్కరు వస్తారని విమర్శించారు. తప్పకుండ మీరు అభ్యర్థుల గురించి మీరు ఆలోచించాలని పేర్కొన్నారు. ఎలక్షన్స్ ఐపోగానే దుకాణం మొదలవుతుంది.. పార్టీల చరిత్రల ఆధారంగా ఓటు వేయాలన్నారు. అప్పుడే అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
సీఎం కేసీఆర్ జగిత్యాల ప్రజాశీర్వదా సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఆగం కావద్దు నిజానిజాలు తెలుసుకొని ఓటు వేయాలన్నారు. జగిత్యాలలో ఎవరు గెలుస్తారో ఆ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటుందని తెలిపారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉందో, 10 ఏండ్ల BRS పాలన ఎలా ఉందో గమనించాలని కోరారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టింది కాంగ్రెస్ అని ఆరోపించారు. ఉప ఎన్నికల్లో కరీంనగర్ నుండి జీవన్ రెడ్డి సమైక్య ఆంధ్రుల తరపున తన…
నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ప్రజా ఆశీర్వదా సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చాయంటే అందరూ వచ్చి వాగ్దానాలు చేస్తూ ఉంటారు.. ఓటర్లు ఒక్కసారి ఆలోచించి ఓట్లు వేయాలని తెలిపారు. ఈ క్రమంలో.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ 58 సంవత్సరాల పాలనలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. అందుకోసం ప్రజలందరూ ఆలోచించాలన్నారు.
కొడంగల్ నియోజక వర్గం కోస్గి ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆయనతో పాటు రాజ్యసభ సభ్యులు కేశవరావు, కోస్గి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి, మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే ఆగం చేసే వారు వస్తారని ఆరోపించారు. ప్రజల మధ్యన ఉండే వారికి ఓటు వేస్తే కొడంగల్ అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
తెలంగాణ ఎన్నికలు దగ్గర పడే కొద్ది రాజకీయ పార్టీ నేతలు జోరు పెంచుతున్నారు. వీలైనంత వరకు అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసే విధంగా షెడ్యూల్ చేసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా.. సీఎం కేసీఆర్ తాండూరులో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కత్తి వారికి ఇచ్చి యుద్ధం మనల్ని చేయమనడం సమంజసం కాదు.. ప్రజలు ఆలోచించండని అన్నారు.