Viral Fever: తెలంగాణ రాష్ట్రంలో వైరల్ ఫీవర్ విజృంభిస్తోంది. ఏ హస్పటల్ ను చూసిన పేషంట్స్ తో కిటకిటలాడుతోంది. వందల్లో ఉండే ఔట్ పేషెంట్స్ (ఓపీ) కేసులు కాస్త వేలలో నమోదు అవుతున్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్, డెంగ్యూ, చికెన్ గున్యా, డయేరియా, గాస్ట్రో సమస్యలు, మలేరియా, టైఫాయిడ్, డిఫ్తిరియా వంటి సమస్యలతో ఆస్పత్రులకు ప్రజలు క్యూ కడుతున్నారు. ప్రతి ఇంట్లో దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్న వారే కనిపిస్తున్నారు. అయితే, వీటన్నిటికీ సింటామాటిక్ ట్రీట్మెంట్ అందిస్తున్నామని ప్రభుత్వ పరంగా అన్ని వైద్య సేవలు అందిస్తున్నామని వైద్యులు చెప్పుకొస్తున్నారు.ఇక, టెరిషరి కేర్ సెంటర్ గా ఉన్న ఉస్మానియా ఆస్పత్రి, గాంధీ, చెస్ట్ , ఫీవర్ హాస్పిటల్స్ లో ఓపీలు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి.
Read Also: NTR Health University: మారిన హెల్త్ యూనివర్సిటీ పేరు.. గెజిట్ విడుదల
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ చేపట్టిన ఫీవర్ సర్వేలో కూడా జ్వరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయినట్లు వెల్లడైంది. జ్వరాలతో పాటు శ్వాసకోస సమస్యలు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. సాధారణ జ్వరం అయినా సరే భయపడి వైద్యుల దగ్గరకు ప్రజలు పరుగులు తీస్తుండటంతో గంటల తరబడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెయిటింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పాడింది. దోమల బారిన పడకుండా, కలుషిత నీరు తాగకుండా తగిన జాగ్రత్తలను ప్రజలు తీసుకోవాలని డాక్టర్లు వెల్లడించారు.