వరంగల్ కేఎంసి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సర్జరీలు నిలిచిపోయాయి. ఏసీలు పనిచేయకపోవడంతో వైద్యులు సర్జరీలను నిలిపివేశారు. వారం రోజుల నుంచి ఆసుపత్రి లో సెంట్రల్ ఏసీలు పనిచేయకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కేఎంసి సుపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోజు 10 నుంచి 15 సర్జరీలు జరుగుతుంటాయి. సర్జరీలు నిలిచిపోవడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. Also Read:Anupama : మళ్ళీ అదే హీరోతో జతకడుతున్న అనుపమ సర్జరీలు నిర్వహించాల్సిన పేషంట్లను వైద్యులు ఆన్ లీవ్ పై శనివారం ఇంటికి పంపించారు.…
భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులు తమ అవసరాల కోసం ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణిస్తుంటారు. రైలులో ప్రయాణించడానికి అనేక వర్గాల ప్రయాణికులకు రైల్వే ప్రత్యేక రాయితీలను అందిస్తుంది. ఈ వర్గాలలో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రయాణీకుల వర్గం కూడా ఉంది. వీరికి భారతీయ రైల్వే వివిధ సడలింపులను ఇస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులకు సుస్తి చేసింది. సీజనల్ వ్యాధులకు తోడు విష జ్వరాలు విజృంభిస్తున్నా.. తగినన్నీ మందులు లేకపోవడంతో పేషెంట్స్‌కు సమస్యలు తప్పడం లేదు. రాష్ట్రంలోని గవర్నమెంట్ దవాఖానాల్లో మందుల కొరత విపరీతంగా పెరిగిపోయింది.. వైద్యులు ప్రిస్క్రిప్షన్‌లో పది రకాల మందులు రాస్తే, కేవలం రెండు మూడు రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి.
రోగులపై ఓ వైద్యుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఘటన ఒడిశాలోని కటక్‌లోని ఓ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కాగా.. ఇద్దరు రోగులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వారి బంధువులు ఆ వైద్యుడిని చితకబాదారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు.
Viral Fever: తెలంగాణ రాష్ట్రంలో వైరల్ ఫీవర్ విజృంభిస్తోంది. ఏ హస్పటల్ ను చూసిన పేషంట్స్ తో కిటకిటలాడుతోంది. వందల్లో ఉండే ఔట్ పేషెంట్స్ (ఓపీ) కేసులు కాస్త వేలలో నమోదు అవుతున్నాయి.
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగిని పట్టించుకోకుండా వైద్యులు, సిబ్బంది డ్రమ్ముల మోతతో నృత్యాలు చేసారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ వినియోగదారులు వైద్యులు, సిబ్బంది పై చర్యలు తీసుకోవాలిని కోరుతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి పదవి విరమణ చేశారు. ఉద్యోగికి వీడ్కోలు పలికేందుకు ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా డప్పు చప్పుళ్లతో వైద్యులు,…
యూఎస్ లోని ఒరెగాన్‌లోని ఒక ఆసుపత్రిలో ఓ నర్సు రోగులకు ఇచ్చిన మందులను దొంగిలించి వాటికి బదులుగా డ్రిప్ వాటర్ నింపింది. దీంతో 10 మంది రోగులు మృతి చెందారు.
MGM Hospital: కోతుల చేష్టలు రోగులకు ఆవస్థలు తెచ్చిపెట్టాయి. శుక్రవారం అర్ధ రాత్రి సమయంలో హనుమకొండ ఎంజీఎం ఆసుపత్రిలోని అత్యవసర వైద్యవిభాగం వెనుకాల ఏఎంసీకి వెళ్లే దగ్గర కోతులు విద్యుత్తు స్తంభాల తీగలపై అటు ఇటు కదిలించాయి.