అసలే ఇబ్బందులు పడుతున్న ఓజి సినిమా టీమ్‌కి మరో షాక్ తగిలింది. ఎంతో కాలం గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే ఓజి సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ఇమ్రాన్ హష్మీ డెంగ్యూ బారిన పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆయన సినిమా నుంచి బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఓజి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అనారోగ్యం వల్ల ఆయనను హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. Also Read:Sreeleela: ‘ఉస్తాద్’ కోసం…
Delhi : దేశ రాజధానిలో దోమల వల్ల వచ్చే వ్యాధుల కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దోమల వల్ల వచ్చే డెంగ్యూ వ్యాధితో ఆదివారం తొలి మరణం సంభవించింది. డెంగ్యూతో బాధపడుతున్న 54 ఏళ్ల వ్యక్తి గత వారం లోక్ నాయక్ ఆసుపత్రిలో మరణించినట్లు అధికారులు తెలిపారు.
Karnataka Govt: కర్ణాటక రాష్ట్రంలో భారీగా డెంగ్యూ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో డెంగ్యూను అంటు వ్యాధిగా కన్నడ సర్కార్ పేర్కొంది. గతేడాది 5 వేల డెంగ్యూ కేసులు నమోదు అవగా.. ఈ ఏడాది మాత్రం ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 25 వేల కేసులు నమోదు అయ్యాయి.
సీజనల్ వ్యాధుల కట్టడి పై సచివాలయంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో డెంగ్యూ కట్టడిపై అధికారులకు మంత్రి దామోదర రాజనర్సింహ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో డెంగ్యూ కేసుల కట్టడిపై ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని మంత్రి ఆదేశం ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో డెంగీ పంజా విసురుతోంది. ప్రస్తుతం 5,500పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అనేక జిల్లాల్లో 100కు పైగా కేసులు నమోదు అవగా.. ఇక, హైదరాబాద్ లో 2148, కరీంనగర్ 224, ఖమ్మం 641, మహబూబాబాద్ 103, మహబూబ్ నగర్ 120, మేడ్చల్ మల్కాజ్ గిరి 356, నల్గొండ 151, పెద్దపల్లి 155, రంగారెడ్డి 100, సంగారెడ్డి 132, సూర్యాపేట 222, వరంగల్ లో 208 కేసులు నమోదు అయినట్లు వైద్యులు తెలిపారు.
ఈ సంవత్సరం సీజనల్ వ్యాధులు గణనీయంగా పెరుగుతుండటంతో, హైదరాబాద్ , తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో సాధారణ ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి , అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ బి రవీందర్ నాయక్ శనివారం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, డెంగ్యూ, చికున్‌గున్యా , మలేరియా డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా , వైరల్ జ్వరాలతో సహా దాదాపు అన్ని ప్రధాన సీజనల్ వ్యాధులు గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం…
Dengue Fever in Bhoompally Village: కామారెడ్డిలో విషాదం చోటుచేసుకుంది. సదాశివనగర్ మండలం భూంపల్లి గ్రామానికి చెందిన మనశ్రీ (12) అనే బాలిక డెంగ్యూ జ్వరం బారిన పడి మృతి చెందింది. నాలుగు రోజుల క్రితం మనశ్రీకి తీవ్ర జ్వరం రాగా.. కుటుంబసభ్యులు స్థానికంగా చికిత్స చేయించారు. అయినా కూడా మనశ్రీకి జ్వరం తగ్గలేదు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతి చెందింది. Also Read: Hyderabad News: దొంగను కొట్టి చంపిన పండ్ల వ్యాపారి..…
దోమల ద్వారా సంక్రమించే డెంగ్యూ వ్యాధిని నిరోధించేందుకు భారతదేశం పరిష్కారాన్ని కనుగొంది. దోమ కాటు ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి శాస్త్రవేత్తలు వ్యాక్సిన్‌ను కనుగొన్నారు.
Viral Fever: తెలంగాణ రాష్ట్రంలో వైరల్ ఫీవర్ విజృంభిస్తోంది. ఏ హస్పటల్ ను చూసిన పేషంట్స్ తో కిటకిటలాడుతోంది. వందల్లో ఉండే ఔట్ పేషెంట్స్ (ఓపీ) కేసులు కాస్త వేలలో నమోదు అవుతున్నాయి.