పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. వైద్యులపై కరుణ చూపించారు. ఒకేసారి భారీగా జీతాలు పెంచారు. ప్రభుత్వ వైద్యులకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు జీతాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు.
Bird Flu: తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. గోదావరి జిల్లాల్లో వైరస్ తో చనిపోతున్న కోళ్లకు బర్డ్ ఫ్లూగా నిర్ధారణ అయ్యింది. పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో తీసుకున్న శాంపిల్స్ పాజిటివ్ గా వచ్చింది.
Eknath Shinde: మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిండే ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఈరోజు (డిసెంబర్ 3) థానేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇక, హస్పటల్ కి తీసుకెళ్లగా, వైద్యులు అతనికి పూర్తి స్థాయిలో ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని భింద్‌లో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఒక మహిళ కడుపులో కత్తెర ఉన్నట్లు సిటి స్కాన్‌లో తేలింది. ఇది చూసిన డాక్టర్లు షాకయ్యారు. ఈ ఘటన తాజాగా చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. 44 ఏళ్ల మహిళ రెండేళ్ల క్రితం గ్వాలియర్‌లోని కమలా రాజా ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకుంది.
మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నందిగం సురేష్ అస్వస్థతకు గురి కావడంతో.. జిల్లా జైలు అధికారులు ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్‌లో ఉన్న వైద్యులకు పీజీలో ఇన్ సర్వీస్ కోటాకు సంబంధించి జీవో 85 తమకు రావాల్సిన సీట్లను దూరం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు విజ్ఞాపన పత్రం అందచేశారు.
ప్రధాని మోడీకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లేఖ రాసింది.. అన్ని ఆస్పత్రులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరింది. ఐఎంఏతో ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు సమావేశం అయ్యారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించాలని కోరింది.
హైదరాబాద్ నగరంలో మునుపెన్నడూ లేనంతగా దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో నగర వాసులు బెంబేలెత్తిపోతున్నారు. బాబోయ్.. అంటూ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.