వికారాబాద్ జిల్లా రాఘవపూర్ నీటి శుద్ధి కేంద్రంలో ట్రైనింగ్ సెంటర్ ను ముఖ్యమంత్రి కార్యాలయం, మిషన్ భగీరథ కార్యదర్శి స్మిత సభర్వాల్ ప్రారంభించారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల హెల్పేర్ ల (VRA) శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్మిత సభర్వాల్ మాట్లాడుతూ.. యావత్ దేశంలోనే మిషన్ భగీరథ ఓ ప్రత్యేక ప్రాజెక్ట్ అంటూ ప్రశ్నించారు. ప్రతీ రోజు ఒక కోటికి పైగా కుటుంబాలకు తాగునీరు అందిస్తున్నాము అని తెలిపారు. ఏదో జన్మలో పుణ్యం చేశా.. అందుకే ఈ డిపార్ట్మెంట్ లో పనిచేసే అదృష్టం దక్కింది అని మిషన్ స్మిత సభర్వాల్ పేర్కొన్నారు.
Read Also: Jason Sanjay: బ్రేకింగ్: డైరెక్టర్ అవుతున్న స్టార్ హీరో కొడుకు.. మొదటి సినిమా ఎవరితో అంటే?
రెవిన్యూ శాఖలో ఎన్నో ఏళ్లుగా వీఆర్ఏలుగా చాలా బాధ్యతగా పని చేశారు అని మిషన్ భగీరథ కార్యదర్శి స్మిత సభర్వాల్ చెప్పారు. అదే నిబద్ధతతో ఇక్కడ కూడా పని చేస్తారని ఆశిస్తున్నాను అని ఆమె అన్నారు. ఈ డిపార్ట్మెంట్ లో ఎదగడానికి యువకులకు ఎంతో అవకాశం ఉంది.. ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించడమే మిషన్ భగీరథ తొలి ప్రాధాన్యత.. తెలంగాణలోని 120 నీటి శుద్ది కేంద్రాల్లో పనిచేసే ఇంజినీర్లు, సిబ్బందికి అత్యుత్తమ ప్రమాణాలతో నీటిని శుద్ది చేసే ప్రక్రియపై నిరంతరం శిక్షణ ఇస్తున్నాం.. అందులో భాగంగానే ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించామని ఆమె తెలిపారు. ప్రజలకు మంచి నీరు అందించడమే తమ తొలి లక్ష్యం అని ముఖ్యమంత్రి కార్యాలయం, మిషన్ భగిరథ కార్యదర్శి స్మిత సభర్వాల్ చెప్పారు.
Read Also: Mamata Banerjee: డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలు..! సంచలన ప్రకటన