కేబినెట్ సబ్ కమిటీకి భూముల వివరాలను వెంటనే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. జీవో నెంబర్ 166 కింద వచ్చిన అప్లికేషన్స్, జీవో నెంబర్ 58 ,59 కింద వచ్చిన దరఖాస్తులు , అసైన్డ్ ల్యాండ్స్, ప్రభుత్వ భూములు, ఎండోమెంట్ వక్ఫ్ భూములు, కోర్టు కేసులో ఉన్న భూముల వివరాలను సమర్పించాలని పేర్కొంది.
దీంతోపాటు ఆ భూముల విలువ ఎంత అనే వివరాలను కూడా పంపించాలని ఆదేశాలు జారీ చేసింది.హౌస్ సైట్స్ కోసం కేబినెట్ సబ్ కమిటీని సెప్టెంబర్‌లో ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ అనధికారిక లే అవుట్స్, ఫ్లాట్స్ క్రమబద్ధీకరణ గ్రామకంఠం భూముల పై రిపోర్ట్ ఇవ్వనుంది.