తెలంగాణలో 30 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది గుండు సున్నా అని మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఆరు గ్యారంటీలపై వారికే గ్యారంటీ లేదు అని విమర్శలు గుప్పించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆటో కార్మికుల నిరసన, భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సిరిసిల్ల పట్టణం కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు 8 వందలకు పైగా ఆటోలతో భారీ ర్యాలీ, నిరసన చేపట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని వెల్లడించింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అధికారం చేపట్టగానే మొదటి గ్యారంటీగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసింది.
సర్కారులో ఇబ్బందులను, బాధలను తెలియజేయడం శుభ పరిణామం అని ఆయన పేర్కొన్నారు. ప్రజా అభిమానం చూరగొనేలా పని చేయాలని చెప్పాను.. ప్రభుత్వంలో నా పాత్ర ఏమి ఉండదు అని జానారెడ్డి వెళ్లడించారు.
తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేయాలని పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. 2014 జూన్ రెండవ తేదీ వరకు తెలంగాణ ఉద్యమకారుల మీద ఉన్న కేసుల వివరాలు అందజేయాలని అన్ని జిల్లాల ఎస్పీలను కమీషనర్లను తెలంగాణ డీజీపీ ఆదేశించారు. అంతేకాకుండా.. 2009 మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి 2014 జూన్ రెండవ తేదీ వరకు నమోదైన అన�
TS Government: తెలంగాణలో పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త. రెగ్యులరైజ్ చేసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) వేతనాలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పట్నం మహేందర్‌రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం శాఖలను కేటాయించింది. సమాచార పౌర సంబంధాల శాఖ, గనులు భూగర్భవనరుల శాఖను ఆయనకు కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇవాళ (శనివారం) ఉత్తర్వులు జారీ చేశారు.
రైల్వే పనులు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాటలు ఎవ్వరూ నమ్మే స్థితిలో లేరు.. బీఆర్ఎస్ ప్రభుత్వం మాట డ్యామెట్ కథ అడ్డం తిరిగింది చందంలా తయారు అయ్యింది అని ఆయన వ్యాఖ్యనించారు.
బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తారని నేను కూడా ఊహించలేదు.. నా హయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం జరగటం నా అదృష్టంగా భావిస్తున్నాను అని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ కు ఆర్టీసీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ఆయన అన్నారు.