AP Govt: ఉద్యోగ సంఘాలతో మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం ముగిసింది. ఉద్యోగుల సంఘాల నేతల అభిప్రాయాలను మంత్రులు తెలుసుకున్నారు. ఉద్యోగ సంఘాల నేతల అభిప్రాయాలను క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించనున్నారు.
సోషల్ మీడియాలో మహిళలను కించపరిచే పోస్ట్ ల పై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేసింది.. మంత్రులు వంగలపూడి అనిత, నాదెళ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్థసారథిలతో ఉప సంఘం ఏర్పాటు చేసింది కూటమి సర్కార్.. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది..
రుషికొండ టూరిజం రిసార్ట్‌లకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రులు కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, డోల బాలవీరంజనేయస్వామి సభ్యులుగా కమిటీ ఏర్పాటు అయింది. టూరిజం స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సమన్వయంతో ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది. అవసరాన్ని బట్టి టూరిజం శాఖకు సంబంధించి కొంతమంది అధికారులను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. Also Read: Pawan Kalyan: 21 ఏళ్ల వయసులోనే రాజకీయ ఆలోచనలు వచ్చాయి..…
రామాయపట్నం పోర్టుపై ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం.. రామాయపట్నం పోర్టు కనెక్టివిటీ పెంపు ప్రతిపాదనపై దృష్టిసారించింది.. పరిశీలనకు ముగ్గురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని నియమించింది.. ఆర్థిక, ఐ అండ్ ఐ, టూరిజం శాఖల మంత్రులతో ఉప సంఘం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టులకు శుభవార్త చెప్పింది.. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నేడు అధికారులతో రెవెన్యూ శాఖ సమీక్ష సమావేశంలో నిర్వహించారు సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా ఆదేశించారు.. ఇందు కోసం ముగ్గురు మంత్రులతో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, పొంగూరు నారాయణతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూముల కేటాయింపు సంబంధించి మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం అయింది... సచివాలయంలో మంత్రి నారాయణ నేతృత్వంలో ఈ సమాశేం జరిగింది.. రాజధాని ప్రాంతంలో పలు సంస్థలకు భూకేటాయింపులపై ఈ సమావేశంలో చర్చించారు.. సమావేశానికి మంత్రులు నారాయణ, భరత్, అధికారులు హాజరయ్యారు..
రాజధాని ప్రాంతంలో వివిధ సంస్థలకు కేటాయించే భూముల విషయంపై ఓ నిర్ణయం తీసుకోనుంది కేబినెట్ సబ్ కమిటీ.. పలు భూ కేటాయింపులపై ఇవాళ ఉదయం 11 గంటలకు మంత్రివర్గ ఉప సంఘం సమావేశం కానుంది..
తెలంగాణ ఏప్రిల్ 14 (సోమవారం) నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉందని నీటి పారుదల, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ప్రకటించారు. సచివాలయంలో జరిగిన ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్-కమిటీ తుది సమావేశానికి అధ్యక్షత వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, చట్టం యొక్క విధి విధానాలను వివరించే ప్రభుత్వ ఉత్తర్వు (జీఓ) అంబేద్కర్ జయంతి నాడు జారీ చేయబడుతుందని అన్నారు. జీఓ యొక్క మొదటి కాపీని ముఖ్యమంత్రి ఎ…
Caste Census : తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన కులగణన సర్వే నివేదికను ఈ రోజు మధ్యాహ్నం ప్లానింగ్ కమిషన్ అధికారులు కేబినెట్ సబ్ కమిటీ కి అందజేశారు. రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా నేతృత్వంలోని బృందం, కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ నివేదికను సమర్పించింది. ఈ సమావేశం సచివాలయంలో నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కులగణన సర్వే దాదాపు 50…
సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.. రాజధానిలో సంస్థలకు భూకేటాయింపులపై మంత్రివర్గ ఉప సంఘం చర్చించి ఓ నిర్ణయానికి వచ్చింది.. అమరావతిలో కార్యాలయాలు ఏర్పాటుకు గతంలో పలు సంస్థలకు ప్రభుత్వం భూకేటాయింపులు చేసిన విషయం విదితమే కాగా.. ఆయా సంస్థల ఏర్పాటు, కొత్తగా భూ కేటాయింపులకు వచ్చిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించారు..