ఏజెన్సీ లే టార్గెట్ గా విత్తన కంపెనీలు మోసాలకు తెగిస్తున్నాయి. అమాయక ఆదివాసీ రైతులను లక్కీ డ్రా ల పేరుతో చీట్ చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్దంగా అడ్వాన్స్ బుకింగ్ చేయడంతో పాటు బహుమతులంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో విత్తన కంపెనీల మాయాజాలానికి, మోసాలకు రైతులు బలవుతున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నకిలీ విత్తనాలు ఏటా రైతులను నిండాముంచుతున్నాయి. అందమైన బ్రోచర్లు, ఆకట్టుకునే విధమైన కరపత్రాలు ,దృష్టి మరల్చే విధమైన పేర్లతో రైతులను తమ వైపు తిప్పుకుంటున్నారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందంగా కొత్త వెరైటీలంటూ రైతుల ఉసురుపోసుకుంటున్నారు..ఏదో రకం అంటూ అంటగట్టడం నష్టపోవడం రైతన్న వంతౌతోంది..
తాజాగా ఆదిలాబాద్ జిల్లాలోని రూరల్ మండలం లోకారి,పిప్పల్ దరితోపాటు ఉట్నూర్ ఏజెన్సీలోని పలు గూడెల్లో విత్తనాల కంపెనీల ప్రతినిధులు రైతులను నమ్మించి బుట్టలో వేస్తున్నారు. ఆషామాషీ కాదు బంపర్ ఆఫర్ అంటూ బోల్తా కొట్టిస్తున్నారు.. కేవలం తమ కంపెనీల విత్తన ప్యాకెట్లు మూడు కొంటే చాలు ఎద్దుల జత లేదంటే హెల్మెట్ ఇలా రకరకాల గిప్టు ప్యాక్ లంటూ గ్రామాల్లో ఊదరగొడుతున్నారు..అంతేకాదు కేవలం రెండువందలు కడితే భారీ గిఫ్ట్ మీసొంతం చేసుకోవచ్చంటూ అడ్వాన్స్ బుకింగ్ చేస్తూ కూపన్ల పంపిణీకి తెరలేపారు. రైతులను మాయమాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసే ఎత్తులేస్తున్నారు.
గతంలో కొన్ని కంపెనీలు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం అలాగే గిప్టుల పేరుతో ఒక్కటి కాదు రెండు కాదు 5 వేలమంది నుంచి ఒక్కోక్కరి వద్ద 200 రూపాయల చొప్పున లక్కీ డ్రా పేరిట వసూల్ చేశారు .గిప్ట్ మాత్రం ఎవ్వరికి రాలేదు..పైగా తామంతా మోసపోయామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..పైగా ఇచ్చిన సీడ్స్ సైతం కాతపూత లేక పెట్టుబడి సైతం లాస్ అయ్యామంటున్నారు.. ఇప్పుడు సైతం నదుల పేరున్న ఓ కంపెనీ,మరో రెండు కంపెనీల ప్రతినిధులు ఏజెన్సీ ప్రాంత గ్రామాల్లో తిరుగుతూ మళ్లీ వసూల్లు చేస్తున్నారని రైతులు చెప్పుతున్నారు.
లక్కీ డ్రా ల పేరిట డబ్బులు వసూల్ చేయడం నిబంధనలకు విరుద్దం. పైగా ఎవరూ అడ్వాన్స్ బుకింగ్ చేయించు కోవద్దు..ఎలాంటి వెరైటీ అయినా అందుబాటులోనే ఉంటుంది..కంపెనీలు ఎలాంటి ప్రచారం చేసినా విత్తనాలు కొనుక్కోవాలని వత్తిడి చేసినా చర్యలు తీసుకుంటామని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు..ఎవ్వరైనా లక్కీడ్రాల పేరుతో వసూళ్లకు తెగిస్తే తమకు ఫిర్యాదు చేయాలన్నారు అధికారులు. ఇలా విత్తన కంపెనీల మోసాలకు ఏటా అన్నదాత బలౌతున్నా అధికారులు చేపట్టేచర్యలు నష్టాలను ఏమాత్రం నివారించలేకపోతున్నాయి.
Sarkaru Vaari Paata: తొలి రోజు కుమ్మేసిన సర్కారు వారు