ఏజెన్సీ లే టార్గెట్ గా విత్తన కంపెనీలు మోసాలకు తెగిస్తున్నాయి. అమాయక ఆదివాసీ రైతులను లక్కీ డ్రా ల పేరుతో చీట్ చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్దంగా అడ్వాన్స్ బుకింగ్ చేయడంతో పాటు బహుమతులంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో విత్తన కంపెనీల మాయాజాలానికి, మోసాలకు రైతులు బలవుతున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నకిలీ విత్తనాలు ఏటా రైతులను నిండాముంచుతున్నాయి. అందమైన బ్రోచర్లు, ఆకట్టుకునే విధమైన కరపత్రాలు ,దృష్టి మరల్చే విధమైన పేర్లతో రైతులను తమ వైపు తిప్పుకుంటున్నారు.…