అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో పర్యాటకుల సందడి నెలకొంది. సెలవు రోజులు కావడంతో పర్యాటకులు కుటుంబ సమేతంగా విచ్చేసి ఆనందంగా గడుపుతున్నారు. దానికి తోడు శీతాకాలంలో ప్రకృతి అందంగా కనిపిస్తుంది. మారేడుమిల్లి ప్రాంతంలో పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. దట్టమైన కొండల మధ్యలో చావడికోట వ్యూ పాయింట్‌కి పర్యటకులు ఎగబడుతున్నారు.
జీవనాధారం తాగునీరు. ఏ జీవి అయినా ముందుగా తాగేందుకు నీటి కోసం చూస్తుంది. మనుషులైతే నీరు ఎక్కడ దొరుకుతుందోనని ఎదురుచూస్తుంటాడు. అల్లూరిసీతారామరాజు జిల్లా అరకులోయ పర్యాటకులకు స్వర్గథామం. అయితే అక్కడ వుండే స్థానికులకు మాత్రం ప్రకృతి అందాలు ఏమాత్రం ఆనందాన్ని ఇవ్వవు. తాగేందుకు నీరుంటే వారికి చాలు. అరకులోయ మండలం బస్కీపంచాయతీ రంగినిగూడ గ్రామస్తుల దుస్థితి అంతా ఇంతా కాదు. తాగేందుకు గుక్కెడు నీరు దొరక్క వారు పడుతున్న కష్టాలు అధికారులకు కనిపించడంలేదు. తాగునీటి సమస్య పరిష్కారం…
ఏజెన్సీ లే టార్గెట్ గా విత్తన కంపెనీలు మోసాలకు తెగిస్తున్నాయి. అమాయక ఆదివాసీ రైతులను లక్కీ డ్రా ల పేరుతో చీట్ చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్దంగా అడ్వాన్స్ బుకింగ్ చేయడంతో పాటు బహుమతులంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో విత్తన కంపెనీల మాయాజాలానికి, మోసాలకు రైతులు బలవుతున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో నకిలీ విత్తనాలు ఏటా రైతులను నిండాముంచుతున్నాయి. అందమైన బ్రోచర్లు, ఆకట్టుకునే విధమైన కరపత్రాలు ,దృష్టి మరల్చే విధమైన పేర్లతో రైతులను తమ వైపు తిప్పుకుంటున్నారు.…
గుడిసె..ఇప్పుడు పర్యాటకుల ప్రేమికులను తెగ ఆకట్టుకుంటున్న పర్యటక ప్రాంతం..! తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలంలో ఉన్న ఈగ్రామానికి పర్యాటకులు పోటెత్తుతున్నారు. అయితే విచ్చలవిడిగా రూల్స్ ఉల్లంఘించడంతో…. వచ్చే నెల 20 వరకు అనుమతిని నిలిపివేశారు. కాలుష్య నివారణ విషయంలో ఎలాంటి మినహాయింపులు వుండవంటున్నారు అధికారులు. తూర్పుగోదావరి జిల్లా మన్యంలోని మారేడుమిల్లిలో ఉన్న గుడిసె పర్యాటకుల సొంతం. పర్యాటకుల మదిని దోచే అందాలకొండ గుడిసె. దీని ప్రత్యేకతే వేరు. మారేడుమిల్లికే వన్నె తెచ్చిన వన దేవతకు కలికి తురాయిగా…